ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ( Ratan tata )అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.
టాటా గ్రూప్ ప్రతి రంగంలోనూ అడుగుపెట్టింది.
ఎంతోమంది టాటా కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారు.అంతేకాకుండా రతన్ టాటా తన సంపాదనను ట్రస్ట్‌లకు విరాళంగా ఇస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపపడుతున్నారు.
అందుకే రతన్ టాటాను ఎంతోమందిని స్పూర్తిగా తీసుకుంటారు.అలాగే వివిధ స్టార్టప్ కంపెనీలలో రతన్ టాటా పెట్టుబడి పెట్టి ఔత్సాహిక వ్యాపారవేత్తలను కూడా ప్రోత్సహిస్తున్నారు.
అయితే రతన్ టాటాకు ఇప్పటికే అనేక అవార్డులు వచ్చాయి.ఈ క్రమంలో తాజాగా ఆయనను మరో అవార్డు వరించింది.మహారాష్ట్ర ప్రభుత్వం( Maharashtra govt ) ఉద్యోగ రత్న అవార్డును రతన్ టాటాకు ప్రకటించింది.
మహారాష్ట్ర భూషణ్( Maharashtra Bhushan ) పేరుతో ఉద్యోగ రత్న అవార్డును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ అవార్డును తొలిసారిగా రతన్ టాటాకు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.
పరిశ్రమల విభాగంలో ఈ అవార్డును ప్రకటించారు.సాహిత్యం, కళలు, సైన్స్ రంగాల్లో పేరు పొందినవారికి మహారాష్ట్ర భూషణ్ అవార్డును ఇస్తోంది.
అయితే ఈ ఏడాది ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టింది.ఈ ఏడాది నుంచి ఇక ప్రతి సంవత్సరం వ్యాపారవేత్తలకు ఈ అవార్డును అందించనుంది.అవార్డు రతన్ టాటాకు ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.
ఇండియాలోనే అతి పెద్ద కంపెనీల్లో టాటా కంపెనీ( Tata Company) ఒకటిగా ఉంది.ఇప్పటికీ ఆ సంస్థ గౌరవ చైర్మన్ గా రతన్ టాటా కొనసాగుతున్నారు.
అంత పెద్ద కంపెనీకి యజమాని అయినా రతన్ టాటా చాలా సాధారణంగా ఉంటారు చాలా సింపుల్ గా ఆయన జీవితం గడుపుతారు.దీంతో ఆయనను ఎంతోమంది యువకులు స్పూర్తిగా తీసుకుంటారు.
టాటా గ్రూప్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కృష్టి ఎంతో ఉంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy