రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇటీవల ఈమె యానిమల్( Animal ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే.
ఇటీవల కాలంలో రష్మిక ఓ అరుదైన ఘనత కూడా సాధించారు.ఈ హీరోయిన్ ఫార్మ్ ని చూసిన ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్.
( Forbes India Magazine ) రష్మిక పై ఓ ప్రత్యేక ఆర్టికల్ ని కూడా రాసుకొచ్చింది.ఇలా అరుదైన ఘనతను సాధించినటువంటి రష్మిక తాజాగా చావు నుంచి బయటపడ్డాము అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
దీంతో అభిమానులు ఒక్కసారిగా కంగారుపడుతూ అసలు ఏం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రష్మిక సోషల్ మీడియా వేదికగా మరొక హీరోయిన్ శ్రద్ధ దాస్( Shraddha Das ) తో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ఇలా ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి రష్మిక.మీ సమాచారం కోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము.ఈరోజు మేము చావు నుంచి బయటపడ్డాము అంటూ ఏరోప్లేన్ లో తమ కాళ్ళని చూపిస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు
అయితే రష్మికకు ఏం జరిగిందనే విషయానికి వస్తే ముంబై నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వస్తున్నటువంటి సమయంలో విమానం టేక్ ఆఫ్ అయినటువంటి అర గంటకే తిరిగి ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.పలు సాంకేతిక లోపం కారణంగానే విమానం తిరిగి ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యిందని దీంతో చావు నుంచి మేము తప్పించుకున్నాం అంటూ రష్మిక చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy