ఇళయదళపతికి సెకండ్ హీరోయిన్ గా ఓకే చెప్పిన రష్మిక

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో బీస్ట్ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.

9 ఏళ్ల తర్వాత తమిళ్ లో ఆమె చేస్తున్న రెండో సినిమా ఇదే కావడం విశేషం.ఇక ఇప్పటికే తెలుగు, హిందీ బాషలలో స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే తన హవా సృష్టిస్తుంది.

ఈ నేపధ్యంలో బీస్ట్ మూవీకి హిందీలో కూడా మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది.తెలుగులో అయితే ఎలాగూ విజయ్ సినిమాలకి ఈ మధ్య భాగా ఆదరణ పెరిగింది.

ఈ నేపధ్యంలో భారీ బడ్జెట్ తో యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న బీస్ట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ముగించుకొని పూజా హెగ్డే ఈ బీస్ట్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

Advertisement
Rashmika Second Heroine For Vijay Beast Movie, Pooja Hegde, Tollywood, Pushpa Mo

ఇదిలా ఉంటే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కి కూడా ప్రాధాన్యత ఉంది.తాజాగా ఈ పాత్ర కోసం రష్మిక మందనని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

Rashmika Second Heroine For Vijay Beast Movie, Pooja Hegde, Tollywood, Pushpa Mo

తెలుగులో రెండు సినిమాలు, హిందీలో మూడు సినిమాలతో రష్మిక బిజీగా ఉన్నా కూడా బీస్ట్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.తమిళ్ లో సుల్తాన్ సినిమాతో రష్మిక ఇప్పటికే తెరంగేట్రం చేసింది.ఈ నేపధ్యంలో తన ఫేవరేట్ హీరో విజయ్ సరసన నటించే అవకాశం కావడం, రెమ్యునరేషన్ కూడా గట్టిగా ఇవ్వడంతో పాత్ర నిడివి తక్కువ అయిన రష్మిక ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు