ఆ పని మరే హీరో చేయలేరు... అల్లు అర్జున్ దమ్మున్న హీరో: రష్మిక

అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక( Rashmika ) హీరో హీరోయిన్లుగా నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తుంది  కేవలం ఆరు రోజులలోనే వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఎక్కడ చూసినా పుష్ప హవ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక అల్లు అర్జున్ నటన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనగా మారాయి.

Rashmika Manadanna Crazy Comments On Allu Arjun Acting In Jathara Sequence Detai

ఈ సినిమాలో జాతర సీన్ లో( Jathara Scene ) అల్లు అర్జున్ చీర కట్టుకొని చేసిన సన్నివేశం సినిమాకి హైలెట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సన్నివేశం గురించి రష్మిక మాట్లాడుతూ.ఒక సన్నివేశాన్ని ఇంత అద్భుతంగా చేయగలిగే నటుడు అల్లు అర్జున్ సార్ మాత్రమే నా జీవితంలో మరోసారి ఇలాంటి సీక్వెన్స్ చూస్తానని అనుకోవడం లేదు.

Advertisement
Rashmika Manadanna Crazy Comments On Allu Arjun Acting In Jathara Sequence Detai

ఇంత దమ్ము, పవర్, ఆల్ఫానెస్ ఉన్న హీరో ఓ చీర కట్టుకొని, చీరలోనే డ్యాన్స్ చేసి, ఆ చీరలోనే యాక్షన్ సీక్వెన్సెస్ చేసి, చీరలోనే డైలాగ్స్ చెబితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.సినిమాలో 21 నిమిషాల పాటు చీరలోనే కనిపిస్తూ సందడి చేస్తారు.

Rashmika Manadanna Crazy Comments On Allu Arjun Acting In Jathara Sequence Detai

నిజానికి ఎవరు ఇలా చీర కట్టుకొని కనిపించడానికి ఇష్టపడతారు చెప్పండి.అతన్ని నేను ఎంతో గౌరవిస్తాను.ఆరాధిస్తాను.

జీవితం మొత్తం అతన్ని సపోర్ట్ చేస్తాననీ తెలిపారు.ఇలా చీర కట్టుకొని నటించడం అంటే ఏ హీరో కూడా ఒప్పుకోరు కానీ అలాంటి డేర్ బన్నీ సర్ మాత్రమే చేశారని అందుకే సినిమా కూడా అంతే అద్భుతంగా వచ్చింది అంటూ రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక అల్లు అర్జున్ కూడా పలు సందర్భాలలో రష్మిక సపోర్ట్ కారణంగానే నేను ఇంత బాగా నటించగలిగాను అంటూ రష్మిక నటనపై కూడా ఆయన ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు