తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ రష్మీ ( Anchor Rashmi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రష్మీ ప్రస్తుతం ఒక వైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు యాంకర్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే.
ఇటు బుల్లితెర ప్రేక్షకులను అటు వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది.జబర్ధస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.
ప్రస్తుతం జబర్దస్త్ షో తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ అలాగే పండుగ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.ఇదిలా ఉంటే రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) వేదికపై భావోద్వేగానికి గురైంది.
పొట్టి నరేష్ చిన్న పిల్లల గ్యాంగ్ తో కలసి పిక్ నిక్ కి తీసుకెళ్లలేదని గోల చేస్తుంటారు.
అప్పుడు హైపర్ ఆది ఎంట్రీ ఇస్తాడు.హైపర్ ఆది, రోహిణి, చిన్న పిల్లల మధ్య కామెడీ ఆకట్టుకుంటుంది.హైపర్ ఆది పవన్ కళ్యాణ్ తరహాలో కరాటే స్టంట్ లు చేయాలని ప్రయత్నించి దెబ్బై పోతాడు.
కరాటే స్టంట్ లని హైపర్ ఆది నవ్వులు పూయించే విధంగా చేశాడు.ఇక చివర్లో రష్మీ బర్త్ డే సెలెబ్రేషన్స్( Rashmi Birthday Celebrations ) జరుగుతాయి.ఈ నెల 27న రష్మీ తన జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకోబోతోంది.28 న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ తన పుట్టినరోజు సెలెబ్రేషన్స్ జరుపుకుంది.
డాన్స్ మాస్టర్ పండు( Dance Master Pandu ) తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో రష్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఇంప్రెస్ చేశాడు.చాలా అందంగా మాస్టర్ పండు ఆమెకి బర్త్ డే విషెష్ చెప్పడం విశేషం.ఇక చివర్లో పిల్లలు రష్మీకి ఒక ఫోటో గిఫ్ట్ గా ఇచ్చారు.
ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా రష్మీ వెక్కి వెక్కి ఏడ్చేసింది.దానికి కారణం ఆ ఫొటోలో ఉన్నది తన పెంపుడు కుక్క చుట్కి గౌతమ్.
చుట్కి గౌతమ్ ఇటీవల అనారోగ్యంతో మరణించినట్లు రష్మీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఆ కుక్కకి రష్మీ దహన సంస్కారాలు కూడా నిర్వహించింది.
ఇప్పుడు తన పెంపుడు కుక్కని ఒక్కసారి ఫొటోలో చూడడంతో రష్మీ ఏడుపు ఆపుకోలేకపోయింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy