గుంటూరు నగర పాలక సంస్థ సమావేశంలో రసాభాస

గుంటూరు నగర పాలక సంస్థ సమావేశంలో గందరగోళం నెలకొంది.సమావేశాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాకపోవడంపై వైసీపీ ప్రశ్నించింది.

ఈ క్రమంలోనే ఎంపీ మిస్సింగ్ అంటూ వైసీపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.దీంతో వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అనంతరం వైసీపీ సభ్యులపై టీడీపీ కార్పొరేటర్లు దూసుకెళ్లారు.ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం తోపులాటకు దారి తీసింది.

వివాదంలో జోక్యం చేసుకున్న మేయర్ ఇరువర్గాలను సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు.అయితే ఎంపీ గల్లా జయదేవ్ ను సమావేశాలకు పిలిపించాలని వైసీపీ డిమాండ్ చేసింది.

Advertisement
చుండ్రు నివారణకు బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్.. తప్పక ట్రై చెయ్యండి!

తాజా వార్తలు