డిజిటల్ వెబ్ సిరీస్ కి రెడీ అవుతున్న బాలీవుడ్ క్రేజీ హీరో

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ప్రస్తుతం నడుస్తుంది.

కరోనా కారణంగా థియేటర్లు మూతబడటం, సినిమాల రిలీజ్, షూటింగ్ లు కూడా చాలా వరకు తగ్గిపోవడం ఇప్పుడు ఓటీటీ ఛానల్స్ కి వరంలా మారింది.

ఈ అవకాశాన్ని డిజిటల్ ఛానల్ సంస్థలు రెండు చేతులా ఒడిసిపట్టుకుని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో దొరికిన ఈ స్పీడ్ ని గ్రాస్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఇందులో భాగంగా ఓ వైపు రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలని నిర్మాతలకి భారీ మొత్తంలో ఆఫర్ ఇచ్చి కొనేసుకుంటున్నారు.

Ranbir Kapoor To Make Digital Debut With 10-part Action Series, Bollywood, Digit

అదే సమయంలో వెబ్ సిరీస్ ల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు.ఈ వెబ్ సిరీస్ లు కూడా ఏదో సాదాసీదా నటులతో చేస్తే వర్క్ అవుట్ అవ్వదని భావించి ఏకంగా ఫేమ్ ఉన్న సెలబ్రెటీల మీద ఫోకస్ పెట్టారు.

అలాగే టాలెంటెడ్ దర్శకులని కూడా రంగంలోకి దించుతున్నారు.వెబ్ సిరీస్ లు అన్ని కూడా కంటెంట్ బేస్ కాబట్టి అందులో నటిస్తే తమకి సెల్ఫ్ సాటిస్ఫేక్షన్ ఉంటుందని చాలా మంది నటులు భావిస్తున్నారు.

Advertisement

అందులో మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ కథలు వచ్చినప్పుడు మొహమాటం లేకుండా చేయడానికి రెడీ అయిపోతున్నారు.ఒక్కోసారి సినిమా కెరియర్ గాడి తప్పే అవకాశం ఉంది.

అయితే వెబ్ సిరీస్ లు అనేవి ఫ్యూచర్ జెనరేషన్ కాబట్టి వాటిలోకి అడుగుపెడితే తమ కెరియర్ కి ఎలాంటి డోకా ఉండదని భావించి వాటిపైన ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పటికే కాస్తా ఫేడ్ అవుట్ అయినా హీరోలు, హీరోయిన్స్ , కొత్త నటులు అందరూ వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టారు.

తమన్నా, కాజల్, సమంత, ప్రియమణి లాంటి స్టార్స్ వెబ్ సిరీస్ లకి రెడీ అయిపోయారు.ఇదే బాటలో ఇప్పుడు బాలీవుడ్ లో ప్లే బాయ్ గా గుర్తింపు పొందిన హీరో రణబీర్ కపూర్ కూడా డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిపోయాడు.

హాలీవుడ్‌ నటుడు టామ్‌ హిడిల్‌స్టన్‌ నటించిన టీవీ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ హిందీ వెర్షన్‌లో నటించనున్నారట రణ్‌బీర్‌.ఇంగ్లిష్‌లో విజయం సాధించిన ఈ కథ ఆధారంగా హిందీలో 10 ఎపిసోడ్స్‌ నిర్మించనున్నారని సమాచారం.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

కొన్ని వారాల క్రితమే ఈ సిరీస్‌లో నటించడానికి రణ్‌బీర్‌ అధికారికంగా సైన్‌ చేశారని టాక్‌.

Advertisement

తాజా వార్తలు