రానా 'అరణ్య'ను ఇక మోయలేమంటున్న మేకర్స్‌

కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఏడు నెలల పాటు థియేటర్లు మూతబడే ఉన్నాయి.ఎట్టకేలకు థియేటర్ల ఓపెన్‌కు కేంద్రం నుండి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.

అయితే పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఇంకా సినిమా థియేటర్లు ఓపెన్‌ అవ్వడం లేదు.కరోనా భయంతో ప్రేక్షకులు ఇంకా కూడా థియేటర్లకు రావడం లేదు.

Rana Aranya Movie Release Latest Update, Rana, Aranya, OTT, Theaters, Hindhi, Ra

థియేటర్లు ఓపెన్‌ అయిన తర్వాత విడుదల అవ్వాలని ఎదురు చూస్తున్న సినిమాలకు చాలా ఇబ్బందికర పరిణామం ఇది అని చెప్పుకోవచ్చు.థియేటర్లు పూర్తి స్తాయిలో నడవాలంటే మరో రెండు మూడు నెలలు అయినా పట్టే అవకాశం ఉంది అనిపిస్తుంది.

అందుకే చిన్నా చితకా ఒక మోస్తరు బడ్జెట్‌ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.రానా హీరోగా నటించిన అరణ్య సినిమా మరో రెండు మూడు రోజుల్లో విడుదల కాబోతుంది అనగా థియేటర్లు మూసేశారు.

Advertisement

అప్పటి నుండి మళ్లీ ఇప్పటి వరకు థియేటర్ల కోసం ఎదురు చూసిన అరణ్య ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేందుకు రెడీ అయ్యింది.సినిమా పూర్తి అయ్యి పది నెలలు అవుతున్న నేపథ్యంలో ఇంకా కూడా విడుదల చేయకుండా ఉంటే బడ్జెట్‌ కంటే వడ్డీలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.

అందుకే చేసేది లేక ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను తెలుగు మరియు హిందీలో విడుదల చేయాలని భావించారు.

అందుకు సంబంధించి ఏర్పాట్లు జరిగాయి.అనూహ్యంగా కరోనా రావడంతో ఆపేశారు.

మళ్లీ ప్రమోషన్‌ లు షురూ చేసి సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నారు.రానా అడవి మనిషిగా ఏనుగులతో సహవాసం చేస్తూ అడవిని పరిరక్షిస్తూ జంతువులతో మమేకం అయ్యి జీవించే వ్యక్తిగా కనిపించబోతున్నాడు.

రానా లుక్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.తప్పకుండా ఈ సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

Advertisement

కనుక సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను ప్రముఖ ఓటీటీలో వచ్చే నెలలో స్ట్రీమింగ్‌ చేస్తారని అంటున్నారు.

తాజా వార్తలు