ఏపీలో ఎన్నికలు.. ఏప్రిల్ ఫూల్ అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్..!

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఒకప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్.

ఎన్నో ట్రెండ్ సెట్టర్ సినిమాలు చేసిన దర్శకుడు.అప్పట్లో ఆర్జీవితో సినిమాలు చేయటానికి.

బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలామంది టాప్ మోస్ట్ హీరోలు క్యూ కట్టే పరిస్థితి.కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.

చాలావరకు కాంట్రవర్సీ సబ్జెక్టులు ఫోకస్ చేస్తూ మీడియాలో కామెంట్లు చేయటం.రకరకాల పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

Advertisement

ఈ రకంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు అవుతున్నట్లు ఆర్జీవి పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని వైసీపీ వర్గాల నుండి అందిన సమాచారమని పేర్కొన్నారు.

జూన్ తొలి వారంలో అసెంబ్లీని రద్దుచేసి.డిసెంబర్ నెలలో ఎన్నికలు జరుగుతాయని ట్వీట్ చేయడం జరిగింది.

ఆ తర్వాత కాసేపటికే ఏప్రిల్ ఫూల్ అని తన ట్వీట్ కి ఆర్జీవి రిప్లై ఇవ్వడం జరిగింది.దీంతో రాంగోపాల్ వర్మ లేటెస్ట్ ట్విస్ట్ ట్వీట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!
Advertisement