రాజమౌళి మహేష్ సినిమాపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు.... సినిమా వచ్చేది అప్పుడే అంటూ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ( Ram Charan Tej ) హీరోగా శంకర్( Shankar ) దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్( Game Changer ) .

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.

ఏఎంబి మాల్ లో మీడియా సమావేశంలో ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ సుమ మాట్లాడుతూ రామ్ చరణ్ ని ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు.

Ram Charan Interesting Comments On Rajamouli And Mahesh Movie Release Details, R

ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి( SS Rajamouli ) కూడా హాజరైన సంగతి తెలిసిందే.రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్లో నటించిన RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు.

Advertisement
Ram Charan Interesting Comments On Rajamouli And Mahesh Movie Release Details, R

ఈ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో రాజమౌళి కూడా ఈ సినిమా వేడుకలలో భాగమయ్యారు.ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో( Mahesh Babu ) సినిమాకు కమిట్ అయ్యారు ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

Ram Charan Interesting Comments On Rajamouli And Mahesh Movie Release Details, R

ఇకపోతే తాజాగా సుమ రామ్ చరణ్ ని ప్రశ్నిస్తూ నేడు మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి .మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందని మీరు భావిస్తున్నారు అంటూ సుమ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు రాంచరణ్ సమాధానం చెబుతూ.

ఎలాంటి అడ్డంకులు ఎదురవ్వకుండా ఉంటే కచ్చితంగా  ఏడాదిన్నర లోపే ఈ సినిమా విడుదల అవుతుందని రామ్ చరణ్ తెలిపారు.ఇక రాంచరణ్ ఎన్టీఆర్ నటించిన RRR సినిమా కూడా ఏడాదిన్నర లోపే విడుదల కావాలని భావించారు కానీ అప్పట్లో కరోనా రావడంతో ఈ సినిమాకు ఏకంగా మూడేళ్ల సమయం పట్టిందని ఇప్పుడు అలాంటి అడ్డంకులు రాకపోతే తొందరగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందని చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు