ఆ విషయంలో అరవింద్ మామ చాలా బెస్ట్... రామ్ చరణ్ కామెంట్స్ వైరల్! 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇటీవల బాలకృష్ణ ( Balakrishna ) హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఎపిసోడ్ ప్రసారమైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు ముఖ్యంగా బాలకృష్ణ తన తండ్రి చిరంజీవి ( Chieanjeevi )బాబాయ్ పవన్( Pawan Kalyan ) నాగబాబు( Nagababu ) గురించి పలు ప్రశ్నలు వేశారు.ఈ ముగ్గురి ఫోటోలను చూపించిన బాలకృష్ణ వారి గురించి కొన్ని విషయాలు అడగడంతో చరణ్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

చిన్నప్పుడు నాకు సంబంధించిన అన్ని విషయాలు పవన్ కళ్యాణ్ బాబాయ్ చూసుకునేవారు నాన్న షూటింగ్స్ తో బిజీగా ఉండటం వల్ల బాబాయ్ తోనే ఎక్కువగా టైం స్పెండ్ చేశాను ఏ విషయమైనా బాబాయ్ తోనే షేర్ చేసుకుంటానని తెలిపారు.

ఇక నా హోంవర్క్ విషయానికి వస్తే ఆ బాధ్యత మొత్తం నాగబాబు బాబాయ్ దేనిని చరణ్ తెలిపారు.ఇక ఈ ముగ్గురి నుంచి నువ్వేం నేర్చుకున్నావు అంటూ బాలయ్య ప్రశ్నించడంతో నాన్న ఎప్పుడూ కూడా పెద్దవారికి గౌరవం మర్యాద ఇవ్వాలని చెబుతారు ఆ విషయాన్ని నేను నేర్చుకున్నాను.ఇక నాగబాబు బాబాయ్ ఎప్పుడు అందరితో సరదాగా గడిపేస్తారు సరదాగా జోక్స్ వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటారు.

Advertisement

ఇక కళ్యాణ్ బాబాయ్ నుంచి ఏదైనా నేర్చుకోవాలి అంటే  ఓపిక సహనాన్ని మనం నేర్చుకోవాలని ఆయనకు చాలా ఓపిక ఎక్కువ అంటూ చెప్పేశారు.

ఈ ముగ్గురిలో నువ్వు పార్టీకి వెళ్లాలనుకుంటే ఎవరు ది బెస్ట్ అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు చరణ సమాధానం చెబుతూ పార్టీకి వెళ్లాలంటే ఈ ముగ్గురు బెస్ట్ కాదని అరవింద్ ( Aravind ) మామ   చాలా బెస్ట్ అంటూ తన మామయ్య గురించి తెలిపారు.చిన్నప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఆయనే తీసుకెళ్లేవారు అని తెలిపారు.

ఇలా అల్లు అరవింద్ గురించి చరణ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గాయాల పాలైన నటి రష్మిక మందన్న... అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు