కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన చరణ్... తన కూతురిది తన అభిరుచే అంటూ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇప్పటికే ఈయన మూడు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టారు.

ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న చరణ్ మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడ తన ఫ్యామిలీకి ఎంతో సమయం కేటాయిస్తూ ఉంటారు.ఇటీవల తనకు కుమార్తె జన్మించిన తర్వాత రామ్ చరణ్ ఎక్కువగా తన కుమార్తెతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్న సంగతి మనకు తెలిసిందే.

రామ్ చరణ్ ఉపాసన ( Upasana ) వివాహం జరిగిన తర్వాత 11 సంవత్సరాలకు క్లీన్ కారా ( Klin Kaara ) జన్మించింది.

Ramcharan Gives Special Gift For Her Daughter ,ramcharan, Klin Kaara, Upasana, S

ఇలా తనకు కూతురు పుట్టినప్పటినుంచి రామ్ చరణ్ ఎక్కువగా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ ఉన్నారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తన కుమార్తె గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్ మూగజీవాలను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి మనకు తెలిసిందే .తన ఫామ్ హౌస్ లో ఎన్నో రకాల జంతువులను పెంచుతున్నారు ముఖ్యంగా తన ఫామ్ లో 15 వరకు గుర్రాలు( Horses ) ఉన్నాయని తెలిపారు.

Ramcharan Gives Special Gift For Her Daughter ,ramcharan, Klin Kaara, Upasana, S
Advertisement
Ramcharan Gives Special Gift For Her Daughter ,Ramcharan, Klin Kaara, Upasana, S

రామ్ చరణ్ మగధీర సినిమాలో నటించిన గుర్రాన్ని కూడా రాజమౌళి( Rajamouli )ని అడిగి తనతోపాటు తీసుకువెళ్లారు.తనకు బాద్ షా అనే పేరు కూడా పెట్టినట్లు పలు సందర్భాలలో తెలిపారు.అయితే ఇటీవల ఈ గుర్రానికి మరొక ఆడపిల్ల పుట్టిందట అయితే దానిని తన కుమార్తెకు కానుకగా ఇచ్చారని రామ్ చరణ్ తెలిపారు.

ఇక తన కూతురు కూడా గుర్రంపై ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని ఈయన వెల్లడించారు.గుర్రపు స్వారీ విషయంలో తన కూతురు కూడా తన లాంటి అభిరుచిని కలిగి ఉంది అంటూ రాంచరణ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కామెంట్స్ విన్నటువంటి అభిమానులు అచ్చం తండ్రి అలవాట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు