రాజామౌళికి సలహా ఇచ్చిన వర్మ... ఏ విషయంలో అంటే?

ఎప్పటికప్పుడు వివాదాలతో ఫుల్ బిజీగా ఉండే వివాదాస్పద దర్శకుడు ఎవరు అంటే కళ్లు మూసుకొని చెప్పేయచ్చు రామ్ గోపాల్ వర్మ అని.

ఎప్పుడు బిజీగా ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శక ధీరుడు రాజమౌళికి ఓ అద్భుతమైన సలహా ఇచ్చాడు.

ఆ సలహా చూస్తే ఎవరైనా సరే అబ్బో అనాల్సిందే.అంతగా రామ్ గోపాల్ వర్మ సలహా ఏం ఇచ్చాడు అబ్బా అనుకున్నారా? అదేనండి.ఇప్పుడు పవర్ స్టార్ అంటూ ఓ సినిమా చేస్తున్నాడు కదా! పవర్ స్టార్ ఎన్నికల తర్వాత కథ అంటూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 22న విడుదల కానుంది.

Ram Gopal Varma Sensational Twit For Rajamouli Rrr, Ramgopal Varma, Rajamouli, R

అయితే ఈ సినిమా ట్రైలర్ చూడాలంటే 25 రూపాయలు చెల్లించాలి అని స్పష్టం చేసాడు.ఇంకా ఇప్పుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ కు కూడా అలాంటి సలహానే ఇచ్చాడు.

వర్మ ట్విట్ చేస్తూ.హేయ్ రాజమౌళి ప్రపంచమంత ఆన్లైన్లోకి మారిపోయింది… అదే ప్రస్తుతం సినిమాలన్నిటికీ కొత్త మార్కెట్… ప్రస్తుతం ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలి.

Advertisement

మేమంతా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ని డబ్బులు ఇచ్చి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం అంటూ రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేశాడు.దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..
Advertisement

తాజా వార్తలు