ఆ విషయంలో అందరినీ ఫూల్స్ చేసిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

Ram Charan Will Not Makeover For Acharya, Ram Charan, Acharya, Chiranjeevi, Kora

అయితే ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కూడా చరణ్ కనిపించబోతున్నాడు.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో కేమియో పాత్రలో చరణ్ కనిపించనున్నాడు.

ఇక ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో మనకు కనిపిస్తాడని, అందుకోసం ఆయన పూర్తిగా మేకోవర్ చేయనున్నట్లు ఇటీవల టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తూ వచ్చాయి.అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

Advertisement

ఆచార్య చిత్రంలో చరణ్ ఎలాంటి మేకోవర్ చేయడం లేదని తెలుస్తోంది.కేమియో పాత్ర కోసం చరణ్ ఎలాంటి ప్రయోగాలకు వెళ్లడం లేదట.

దీంతో ఆచార్య చిత్రంలో చరణ్ ఎప్పటిలాగే తనదైన లుక్‌లో కనిపిస్తాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇక ఆచార్య చిత్రంలో చరణ్ పాత్ర 30 నిమిషాల నిడివితో ఉండబోతుందని, ఇంటెర్వల్‌కు ముందు వచ్చే ఈ పాత్ర ఇంటెర్వల్ తరువాత కథను పూర్తిగా మలుపు తిప్పుతుందని చిత్ర యూనిట్ అంటోంది.

కాగా ఈ సినిమాలో చరణ్ పాత్రకు జోడీగా ఓ హీరోయిన్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.త్వరలోనే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను మొదులపెట్టేందుకు చరణ్ రెడీ అవుతున్నాడట.

అటు ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించి, ముగించేయాలని చరణ్ భావిస్తున్నాడు.ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ ఏమిటనేది చరణ్ ఇప్పటివరకు ఓకే చేయలేదు.

వృద్ధాప్యాన్ని వాయిదా వేసే అద్భుతమైన పానీయం

మరి తన నెక్ట్స్ చిత్రాన్ని చరణ్ ఎవరితో చేస్తాడా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు