అల్లు అర్జున్ పుష్ప 2 లో చరణ్ రోల్ ఏంటో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.

ఈ కలయికలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి టాలీవుడ్ సత్తాను మరోసారి చాటి చెప్పారు.

ఇదే కలయికలో ఇప్పుడు పుష్ప 2 తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నటించిన వారందరికీ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో ఇప్పుడు మరింత హైప్ నెలకొంది.

పుష్ప సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్.పుష్పరాజ్ తగ్గేదేలే అని చెబితే రికార్డులు గల్లంతు అవ్వాల్సిందే.

ఇంతకంటే ఎక్కువ రేంజ్ లో పార్ట్ 2 సినిమాను తెరకెక్కించేందుకు సుకుమార్ గట్టి ప్లాన్ తో సిద్ధం అవుతున్నారు.అందుకే ఈ సినిమాలో మరింత మంది స్టార్స్ ను భాగం చేస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాడు.

Ram Charan To Star In Allu Arjun Pushpa 2 Details, Allu Arjun, Allu Arjun, Pushp
Advertisement
Ram Charan To Star In Allu Arjun Pushpa 2 Details, Allu Arjun, Allu Arjun, Pushp

పుష్ప 2 నుండి ఇప్పటికే మాస్ డైలాగ్ రిలీజ్ అయినట్టు వార్తలు వస్తుండగా.ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో మరో కీలక క్యారెక్టర్ ఉంది అని అందులో రామ్ చరణ్ నటిస్తున్నాడు అని మొన్నటి నుండి ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

ఇక తాజాగా ఈ రోల్ ఏంటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Ram Charan To Star In Allu Arjun Pushpa 2 Details, Allu Arjun, Allu Arjun, Pushp

ఈ క్యారెక్టర్ కలెక్టర్ రోల్ అని ఈ అతిథి పాత్రలో రామ్ చరణ్ నటించ బోతున్నాడు అని టాక్.మరి ఇదే నిజమైతే పుష్ప 2 మరింత క్రేజీగా మారనుంది.గతంలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.

అలాగే ఇందులో క్యాథరిన్ కూడా కీలక రోల్ పోషిస్తుంది.అంతేకాదు మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటుడు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించ బోతున్నాడు అని టాక్.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఏది ఏమైనా ఈ వార్తలతో పుష్ప 2 క్రేజ్ అమాంతం పెరిగి పోతుంది.

Advertisement

తాజా వార్తలు