ఆ వ్యక్తి వల్లే నేను చదువుకోలేక పోయాను... రాంచరణ్ కామెంట్స్ వైరల్!

మన సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు కలిసి ఒకే స్కూల్లో చదువుకున్న వారు ఉన్నారు ఇలా ఓకే స్కూల్లో చదువుకొని మంచి స్నేహితులుగా మారి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హీరోలుగా కొనసాగుతున్న వారిలో హీరో రామ్ చరణ్ ( Ramcharan ) అలాగే రానా( Rana ) దగ్గుబాటి శర్వానంద్ ( Sharwanand ) వంటి వారందరూ ఒకరు.

రానా రామ్ చరణ్ మధ్య చాలా మంచి స్నేహబంధం ఉందనే సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరూ ఒకే స్కూల్ కావడంతో వీరి మధ్య స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతుందని తెలుస్తోంది.అంతేకాకుండా ఏదైనా ఒక సినిమా ఈవెంట్ జరిగింది అంటే వీరిద్దరి స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

ఇక ఓకే వేదికపై రామ్ చరణ్ రానా కలిసినప్పుడు ఒకరిపై మరొకరు కంప్లైంట్స్ ఇవ్వడమే కాకుండా వారి సీక్రెట్స్ కూడా బయట పెడుతూ ఉంటారు.తాజాగా రామ్ చరణ్ రానా గురించి మాట్లాడుతూ రానా వల్లే నేను చదువుకోలేకపోయాను అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.8th క్లాస్ నుంచి రానా నేను కలిసి చదువుకున్నాం అప్పటివరకు నాకు మార్కులు బాగా వచ్చేవి కానీ రానా వచ్చిన తర్వాత నాకు మార్కులు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు.

ఈ విధంగా తనకు మార్కులు తగ్గిపోవడానికి కారణం రానా అని తెలిపారు.ఎందుకంటే వాడు నా ముందు బెంచీలో కూర్చునే వాడు ఇంత హైట్ ఉంటాడు.వాడి వెనుక నేను కూర్చుంటే నాకు బోర్డు ఏమి కనిపిస్తుందని తెలిపారు .అంతేకాకుండా వాడు నా క్యారేజ్ తో పాటు నా ఫ్రెండ్స్ క్యారేజ్ కూడా లాక్కొని తినేవాడు అంటూ రానా గురించి రాంచరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అయితే ఈ వీడియో పాతది అయినప్పటికీ తాజాగా మరోసారి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వీరిద్దరు స్కూల్లో చదువుకున్నప్పటికీ ఇండస్ట్రీలో కూడా ఇద్దరు హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు వస్తే చూడాలని ఉంది అంటూ అభిమానులు కూడా ఆరాటపడుతున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు