మళ్లీ అలాంటి లుక్ లో రామ్ చరణ్.. మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ పక్కా అంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

అందులో భాగంగానే చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ( Game Change) సినిమాలో నటిస్తూనే మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు రెడీ అవుతున్నారు.అయితే గేమ్ చేంజర్ సినిమా కారణంగానే బుచ్చిబాబు సినిమా ఆలస్యం అవుతూ వస్తోందని చాలామంది కామెంట్ చేస్తున్నారు.

అయితే ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.

ఇక ఇదే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది.అందుకే రామ్ చరణ్ తన మేకోవర్‌ ను కూడా చేంజ్ చేసుకుంటున్నాడు.గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే లోపు బుచ్చిబాబు ప్రాజెక్ట్ సెట్‌ మీదకు రామ్ చరణ్ వెళ్లేలా కనిపిస్తున్నాడు.

Advertisement

రామ్ చరణ్ తాజాగా కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.వి వి వినాయక్ బర్త్ డే ( VV Vinayak)సందర్భంగా రామ్ చరణ్ విషెస్ చెబుతూ ఇలా కనిపించాడు.

సడెన్‌ గా ఇలా గుబురు గడ్డంతో రామ్ చరణ్ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.రంగస్థలం నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.అయితే ఈ మూవీలో రామ్ చరణ్ భారీ దేహంతో కనిపించబోతోన్నాడట.

బీస్ట్ మోడ్‌లోకి మారబోతోన్నట్లు తెలుస్తోంది.రంగస్థలం సినిమాను మించేలా రామ్ చరణ్ మేకోవర్ ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ మూవీ ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఉంటుందన్న సంగతి తెలిసిందే.

కుస్తీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని గాసిప్స్ వినిపిస్తున్నాయి.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

దేవరతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి రామ్ చరణ్ బుచ్చిబాబుతో మరో క్రేజీ ఆఫర్ దక్కినట్టు అయింది.అయితే తాజాగా చెర్రీ లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోస్ వైరల్ అవ్వడంతో చెర్రీ అభిమానులు సంబంధించి చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు