డాషింగ్ లుక్ లో చరణ్.. నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోస్!

మెగా కుటుంబం నుండి మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.

ఈయన టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు.

ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.అయితే ఈ సినిమా ఘన విజయం ఇచ్చిన ఆనందం కొద్దిరోజులకే పోయింది.

వెంటనే ఆచార్య సినిమాతో అదే రేంజ్ లో ప్లాప్ రావడంతో మెగాస్టార్, చరణ్ ఇద్దరు కూడా తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.

RC15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.ఈయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉన్నాయి.

ఈ సినిమా షూటింగ్ కు ప్రెసెంట్ చరణ్ కాస్త బ్రేక్ ఇచ్చారు.రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు జరుపు కుంటున్న నేపథ్యంలో ఈ సినిమా షూట్ కు బ్రేక్ వచ్చింది.వీరి 10వ పెళ్లి రోజు రావడంతో ఈ దంపతులు ఈ స్పెషల్ డే ను గ్రాండ్ గా జరుపు కుంటున్నారు.

ఈ క్రమంలోనే వీరు ఇద్దరు కలిసి ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నారు.ఈ ఫోటో షూట్ ను ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇక ఈ ఫొటోల్లో చరణ్ లుక్ కు అందరు ఫిదా అవుతున్నారు.చరణ్ సూట్ లో డాషింగ్ లుక్ లో ఆకట్టు కుంటున్నాడు.ఈ ఫొటోల్లో చరణ్ జుట్టు పెంచడంతో మరింత డాషింగ్ గా కనిపిస్తున్నాడు.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

అలాగే ఆర్సీ 15 కోసం న్యూ లుక్ లో ఉన్న చరణ్ ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.ఇక ఆర్సీ 15 సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.

Advertisement

ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు