ఆ విషయంలో తండ్రిని మించి వ్యక్తి రామ్ చరణ్.. మల్లేశ్వర్రావు కీలక వ్యాఖ్యలు

మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఆపదలో ఉన్నారంటే సహాయం చేసేందుకు ముందు వరసలో ఉండేవారు మెగా ఫ్యామిలీ మెంబర్స్ .

మెగా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధర్మ తేజ్ ఇలా పలు స్టార్లు సహాయం చేసేందుకు ముందు వరుసలో ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వారి భావనను తెలియజేస్తూ ఉంటారు.

కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా అటు ప్రభాస్, ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి.అయితే, ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) తను సహాయం చేయడమే కాకుండా తన అభిమానులకు కూడా ఆ మార్గంలో నడిపించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉంటారు.

ఇలా కేవలం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాకుండా తన వారసుడు అయిన రామ్ చరణ్( Ram Charan ) కూడా అదే జాబితాలోకి చేరిపోయాడు.ఈ క్రమంలో తాజాగా అన్ స్టాపబుల్ సోలో రామ్ చరణ్ గొప్పతనాన్ని బాలయ్య( Balayya ) ప్రత్యక్షంగా తెలియజేశారు.

తన అభిమాని పడుతున్న కష్టాలకు రామ్ చరణ్ అందించిన సహాయం గురించి తెలియజేశారు.

Advertisement

అందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.బంగారుపాళ్యానికి చెందిన మల్లేశ్వరరావు( Malleshwara Rao ) ఇండస్ట్రీలో పాలు సినిమాలో, సీరియల్ లలో నటించాడు.చిరంజీవి అభిమాని అయిన మల్లేశ్వరరావు చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకులలో మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసేవారు.

దీంతో బ్లడ్ బ్యాంక్ వ్యవహారాలను చూసే చిరంజీవి అభిమాని సంఘాల అధ్యక్షుడు స్వామి నాయుడుతో పరిచయం బాగా పెరిగిపోయింది.మల్లేశ్వరరావు సతీమణి అయిన వెంకట దుర్గా తన భర్తను చూసేందుకు కుటుంబ సమేతంగా వెళ్లిన క్రమంలో ఆమె తీవ్ర అస్వస్థకు గురి అవ్వడంతో వెంటనే అపోలో ఆసుపత్రిలో( Apollo Hospital ) వైద్యం కోసం జాయిన్ చేశారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న స్వామినాయుడికి తెలియడంతో హీరో రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనకు సమాచారం అందజేయడంతో వెంటనే ఉపాసన స్పందించి అపోలో సిబ్బందికి సమాచారం ఇచ్చి వెంకట దుర్గాకు మరుగైన వైద్యం అందించాలని తెలియజేశారట.దాదాపు 15 రోజులు పాటు ఐసీయూలో ఉన్న ఆమెకు ప్రత్యేక డాక్టర్లు నియమించి ఆమెను కోలుకునే విధంగా చేశారట.

ఇందుకుగాను మల్లేశ్వరరావు కృతజ్ఞతలు తెలియజేసేందుకు అవకాశం కోసం ఎదురు చూశారని.సినీ నటుడు బాలకృష్ణ హోస్టుగా నిర్వహిస్తున్న అన్ స్థాపబుల్( Unstoppable ) ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా రాంచరణ్ వస్తున్న విషయం తెలుసుకొని ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్లను మల్లేశ్వరరావు సంప్రదించి వారు అవకాశం కల్పించడంతో తన అభిమాన హీరో కొడుకు అయినా రామ్ చరణ్ ను చూసి ఒక్కసారిగా మల్లేశ్వరరావు భావోద్వేగానికి గురి అవ్వడంతో పాటు, ఉపాసనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ క్రమంలో ఆహా నిర్వహలు కూడా మల్లేశ్వరరావు ఇతర ఖర్చులకు గాను లక్ష రూపాయలు సహాయం అందజేశారు.

గేమ్ ఛేంజర్ మూవీకి నెగిటివ్ ప్రచారం చేసింది వాళ్లేనా.. అసలేం జరిగిందంటే?
సుజీత్ నెక్స్ట్ సినిమాకి హీరో దొరికేశాడా..?

ఇది ఇలా ఉండగా మరోవైపు రామ్ చరణ్ గురించి హీరో శర్వానంద్ షోలో మాట్లాడుతూ.రామ్ చరణ్ సహాయం చేసేవి తెలిసినవి కొన్ని మాత్రమే.కానీ, తెలియకుండా చరణ్ చాలామందికి సహాయం చేశాడని తెలియజేశాడు.

Advertisement

తాజా వార్తలు