'ఆచార్య' కోసం ఆ చివరి ఘటంకు అంతా సిద్దం

మెగా స్టార్ చిరంజీవి, కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో రామ్‌ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే షూటింగ్‌ మెజార్టీ పార్ట్‌ పూర్తి అయ్యింది.షూటింగ్‌ తుది దశలో ఉండగా కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ఆగిపోయింది.

మళ్లీ ఇన్నాళ్లకు షూటింగ్‌ ను పునః ప్రారంభించారు.రెండు రోజుల క్రితం ప్రారంభం అయిన ఆచార్య సినిమా షూటింగ్ లో రామ్‌ చరణ్‌ నేడు జాయిన్‌ అయ్యాడు.

చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే రెండు చిరు, చరణ్‌ కాంబో సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నారట.

Ram Charan Joins In Acharya Movie Shooting With Chiranjeevi,latest Tollywood New
Advertisement
Ram Charan Joins In Acharya Movie Shooting With Chiranjeevi,latest Tollywood New

మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.ప్రస్తుతం సినిమా కోసం వేసిన భారీ సెట్టింగ్‌ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు.ఇక ప్రముఖ నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు అంతా కూడా ఆచార్య షూటింగ్‌ లో పాల్గొంటున్నారు.

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ ఆర్‌ ఆర్‌ నుండి బ్రేక్ లో ఉన్నాడు.కనుక ఆయన ఈ సినిమా షూటింగ్‌ ను వెంటనే పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

వారం రోజుల డేట్లతో చరణ్‌ పాత్ర పూర్తి అవుతుందని తెలుస్తోంది.ఈ వారం రోజుల్లో రామ్‌ చరణ్‌ ఆచార్య కోసం ఉదయం నుండి రాత్రి వరకు సమయం కేటాయించాల్సి ఉంటుందట.

తద్వారా రామ్‌ చరణ్‌ పాత్ర పూర్తి అవుతుంది.ఇక చిరంజీవి మరియు ఇతర కీలక నటీ నటుల మద్య ఒకటి రెండు రోజుల షూటింగ్‌ అదనంగా ఉంటుందని కూడా అంటున్నారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

 ఈ సినిమాలో కాజల్‌ మరియు పూజా హెగ్డేలు నటించారు.రెజీనా ఐటెం సాంగ్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు