చనిపోయే వరకు తారక్ నా మనసులో ఉంటాడు.. చరణ్ కామెంట్స్ వైరల్!

నిన్న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది.

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ చాలా దూరం నుంచి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా బ్రదర్స్ కు, తారక్ బ్రదర్స్ కు ధన్యవాదాలు అని చరణ్ అన్నారు.

ఏ సిటీకి వెళ్లినా బ్రదర్స్ వచ్చి ఈవెంట్లను సక్సెస్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చరణ్ చెప్పుకొచ్చారు.లైకా ప్రొడక్షన్స్ తో పని చేయాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నానని ఆర్ఆర్ఆర్ తో కుదిరిందని చరణ్ కామెంట్లు చేశారు.

రాజమౌళిని గురువు అనాలో హెడ్ మాస్టర్ అనాలో గైడ్ అనాలో ప్రిన్సిపాల్ అనాలో అర్థం కావడం లేదని చరణ్ చెప్పుకొచ్చారు.రాజమౌళి గారికి చాలాచాలా థ్యాంక్స్ అని చరణ్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ లాంటి బ్రదర్ ను ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చరణ్ కామెంట్లు చేశారు.రాజమౌళి గారి టీం ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించిందని చరణ్ చెప్పుకొచ్చారు.

Advertisement

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి చరణ్ థ్యాంక్స్ చెప్పుకొచ్చారు.వయస్సులో తనకు తారక్ కు తేడా సంవత్సరం మాత్రమేనని నిజ జీవితంలో జూనియర్ ఎన్టీఆర్ చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తారని అయితే పర్సనాలిటీ మాత్రం లయన్ మాదిరిగా ఉంటుందని చరణ్ అన్నారు.

ఎన్టీఆర్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చరణ్ పేర్కొన్నారు.అందరికీ థ్యాంక్స్ చెప్పినా తారక్ కు థ్యాంక్స్ చెప్పనని ఎన్టీఆర్ లాంటి బ్రదర్ ను ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నానని చరణ్ పేర్కొన్నారు.

చనిపోయే వరకు తారక్ నా మనసులో ఉంటాడని చరణ్ వెల్లడించారు.పోలీస్ శాఖకు, ఈవెంట్ ఆర్గనైజర్లకు చాలా థ్యాంక్స్ అని చరణ్ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత తమిళంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ స్పీచ్ అదరగొట్టారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో నన్ను కూడా భాగం చేసినందుకు సంతోషంగా ఉందని ఎన్టీఆర్ అన్నారు.

కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?
Advertisement
" autoplay>

తాజా వార్తలు