మేనకోడలు నివృత్తికి సర్ ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్.. అసలేమైందంటే?

మెగాహీరో రామ్ చరణ్ గురించి పరిచయం అవసరం లేదు.

ఈయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇలా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురావడంతో ఈయన తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో చేయాలని భావించారు.ఈ క్రమంలోనే తన తదుపరిచిత్రం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.

ఇలా సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడిపే రామ్ చరణ్ తనకు షూటింగ్ లో విరామ సమయం దొరికితే తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ కు షూటింగ్ లో కాస్త బ్రేక్ దొరకడంతో అక్క సుస్మిత చెల్లి శ్రీజతో కలిసి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేశారు.

ఇలా తన సిస్టర్స్, ఫ్రెండ్స్ తో కలిసి సొంత ఫ్లైట్లో విదేశాలకు వెళ్లి వచ్చారు.ఇక ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement

ఇకపోతే ఈ ట్రిప్ అనంతరం రామ్ చరణ్ శ్రీజ పెద్ద కుమార్తె నివృత్తికి చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు.నివృతి ప్రస్తుతం ముంబైలో చదువుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏకంగా తన చదువుతున్న స్కూల్ కి వెళ్లి తనకు సర్ప్రైజ్ ఇచ్చారు.

ఈ విధంగా రాంచరణ్ నివృత్తి స్కూల్ దగ్గరికి వెళ్లి తనని కలవడమే కాకుండా తన తోటి విద్యార్థులతో పాటు అలాగే స్కూల్ యాజమాన్యంతో కూడా కాసేపు సరదాగా ముచ్చటించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా తన మామయ్య తనని చూడడం కోసం వెళ్లడంతో నివృత్తి కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో RC 15 అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.దాదాపు ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement