Ram Charan : రామ్ చరణ్ సినిమా సినిమాకు ఎన్ని రోజులు గ్యాప్ తీసుకుంటున్నాడు.. ఇప్పుడే ఎందుకు ఇలా ?

మిస్టర్ పర్ఫెక్ట్ రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం సినిమా సినిమాకి తన క్రేజ్ ను పెంచుకుంటూ టాలీవుడ్( Tollywood ) లోనే నెంబర్ వన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే రామ్ చరణ్ సినిమా సినిమాకి ఎంత గ్యాప్ తీసుకుంటున్నాడని రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో గట్టిగా సాగుతోంది.

ధ్రువ సినిమా నుంచి నేటి వరకు రాం చరణ్ ఊహించని విధంగా పెద్ద మొత్తంలోనే గ్యాప్ తీసుకున్నాడు.మరి ఆ లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం.

ధ్రువ సినిమా ( Dhruva movie )తో సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత రంగస్థలం సినిమా చేశాడు.అయితే ఈ రెండు సినిమాల మధ్య ఏకంగా 477 రోజుల గ్యాప్ తీసుకున్నాడట.

రంగస్థలం కెరియర్ లోనే రామ్ చరణ్ కి బెస్ట్ మూవీ గా నిలిచింది ఆ సినిమా మేనియా నుంచి బయట పడిన తర్వాత బోయపాటి డైరెక్షన్ లో వినయ విధేయ రామ( Vinaya Vidheya Rama ) అనే చిత్రంలో నటించాడు.ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లోనే దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.

Advertisement
Ram Charan Gaps For Every Movie-Ram Charan : రామ్ చరణ్ సి�

అయితే రంగస్థలం సినిమాకి వినయ విధేయ రామ సినిమాకి మధ్య ఏకంగా 288 రోజుల గ్యాప్ ఉండడం విశేషం.

Ram Charan Gaps For Every Movie

ఇక ఈ సినిమా తర్వాత ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమా ట్రిపుల్ ఆర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాంచరణ్ మరి జక్కన్న తీసిన ఈ సినిమా గురించి కొత్తగా చెప్పే పని లేదు.ఆయన ఏదైనా సినిమా చెక్కడ మొదలుపెడితే అది ఎన్ని ఏళ్ళు పడుతుందో ఎవరికి తెలియదు.అదే పరిస్థితి రాంచరణ్ కి కూడా ఎదురైంది పైగా మల్టీస్టారర్ సినిమా ఇద్దరు హీరోల డేట్స్ కుదరాలి.

అందుకే ఈ చిత్రానికి వినేయ విదేయ రామ చిత్రానికి మధ్య 1174 రోజుల గ్యాప్ వచ్చింది.అయితే ఈ సినిమా తర్వాత తన సినిమాలకు సంబంధించిన షెడ్యూల్ కాస్త బిజీ చేసే పనిలో పడ్డాడు రామ్ చరణ్.

Ram Charan Gaps For Every Movie

సినిమా సినిమాకి గ్యాప్ తగ్గించాలని నిర్ణయానికి వచ్చాడు.అందుకే ఆచార్య సినిమాకి చాలా తక్కువ టైం తీసుకున్నాడు ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆచార్య సినిమాకి మధ్య కేవలం 280 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది.ఇక ఆచార్య సినిమా విడుదల ఇప్పటికే 580 రోజులు దాటింది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అంతేకాదు ప్రస్తుతం గేమ్ చేంజర్ ( Game changer )సినిమాతో సినిమాతో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కూడా ఎప్పుడు పూర్తవుతుందో తెలిసే పరిస్థితి లేదు.

Advertisement

అందుకే బుచ్చిబాబుతో తన సినిమాని మార్చిలో మొదలుపెట్టే పనిలో ఉన్నాడు.

తాజా వార్తలు