మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ( RRR movie ) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా గ్లోబల్ వైడ్ గా తన ఖ్యాతిని పెంచుకున్నాడు.
అప్పటి నుండి పాన్ ఇండియన్ స్టార్ అని పిలిపించు కుంటున్నారు.అందుకే చరణ్ సినిమాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఈ ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.ఈ క్రమంలోనే మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో చేయి కలిపాడు.
చరణ్ హీరోగా అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ ( Game Changer ).
ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళింది.కానీ కొన్ని కారణాల వల్ల షూట్ పూర్తి కాలేదు.ఇక ఇప్పుడు శరవేగంగా షూట్ ను పూర్తి చేస్తున్నారు.
మరి తాజాగా చరణ్ ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గత వారం రోజులుగా ఈ సినిమా కోసం రోజుకు 16 గంటల పాటు వర్క్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.అంతేకాదు సెట్స్ లో పెర్ఫెక్ట్ సమయానికి వెళ్లేందుకు ఇష్టపడతానంటూ ఈయన చేసిన కామెంట్స్ విని చరణ్ డెడికేషన్ ను ఫాన్స్ మెచ్చుకుంటున్నారు.కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ( Dil Raju )భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ ( Kiara Advani )గా నటించింది.చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy