'గేమ్ ఛేంజర్' : 10 రోజులపాటు డే అండ్ నైట్ షూట్.. టార్గెట్ ఫినిష్ అవుతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.

ఆర్ఆర్ఆర్( RRR movie ) ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.

ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో గేమ్ ఛేంజర్( Game Changer )ఒకటి.

ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ ( Shankar )తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇప్పటికి ఇంకా రిలీజ్ చేయనేలేదు.

Advertisement

ఇక ప్రస్తుతం షూటింగ్ లో మేకర్స్ బిజీగా ఉన్నారు.నిన్నటి నుండి మైసూర్ లో షూట్ స్టార్ట్ అయ్యినట్టు అఫిషియల్ గా తెలిపారు.చరణ్ కూడా అక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం మైసూర్ లో పది రోజుల పాటు డే అండ్ నైట్ షూట్ జరగనుంది.

ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో డే అండ్ నైట్ అలుపు లేకుండా షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం.అంతేకాదు ఈ షూట్ లో ఎస్ జె సూర్య, 30 ఇయర్స్ పృథ్వీ, సునీల్ తో పాటు కీలక నటీనటులు పాల్గొన్నట్టు టాక్.

కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ( Dil Raju )భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ ( Kiara Advani )గా నటించింది.

చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.

టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!
Advertisement

తాజా వార్తలు