స్పెషల్ జానర్లతో ప్రయోగాలు చేస్తున్న రామ్ చరణ్.. ఆ రెండూ చాలా స్పెషల్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram charan ) కెరీర్ లైఫ్ పరిశీలిస్తే అతడు జానర్లు ఎలా మార్చుతూ ప్రయోగాలు చేస్తున్నాడో అర్థం అవుతుంది.

ఈ హీరో యాక్షన్ మూవీ "చిరుత (2007)"తో ( Chirutha )సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమయ్యాడు.

తర్వాత ఫాంటసీ యాక్షన్ మూవీ మగధీర (2009)లో నటించి స్టార్ హీరో అయిపోయాడు.తర్వాత కూడా ప్రయోగాలు చేస్తూనే హిట్స్ సాధించాడు.

పీరియడ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ "రంగస్థలం"లో( Rangastalam ) చిట్టి బాబుగా చరణ్ అద్భుతంగా నటించాడు.అతడి యాక్టింగ్ పర్ఫామెన్స్‌కు క్రిటిక్స్ కూడా ఫిదా అయిపోయారు.

ఎపిక్ యాక్షన్ డ్రామా మూవీ "ఆర్‌ఆర్ఆర్"లో అల్లూరి సీతారామరాజు పాత్రలో కూడా రామ్ చరణ్ చాలా బాగా నటించాడు.ఈ అద్భుతమైన పాత్రలో చాలా వేరియేషన్స్ చూపించాడు.

Advertisement

"రంగస్థలం" సినిమాతో చరణ్ ఎంత గొప్ప నటుడో తెలియగా, "RRR" సినిమాతో ఆయన గ్రేటెస్ట్ యాక్టర్ అని ప్రూవ్ అయ్యింది.చెర్రీ కళ్లతోనే అనేక ఎక్స్‌ప్రెషన్స్‌ చూపించాడు.

ఎమోషన్స్ చక్కగా పండించాడు.డైలాగ్స్ డిక్షన్ అదిరిపోయింది.

ఈ మూవీ తర్వాత చరణ్‌కు నటనలో తిరుగు లేదని, ఏ పాత్ర ఇచ్చినా చెర్రీ ఇరగదీస్తాడని తెలిసిపోయింది.

ఈ మెగా హీరో "ఆచార్య"( Acharya ) సినిమాలోని కామ్రేడ్ సిద్ధ పాత్రలో కూడా పరకాయ ప్రవేశం చేశాడు.తన పాత్రకు 100% న్యాయం చేశాడు కానీ ఈ మూవీ ఫెయిలైంది.దాంతో అతని కష్టం వృధా అయ్యింది.

హలో అబ్బాయిలు.. హెయిర్ ఫాల్ తో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టేయండి!
డబ్బులు ఎక్కువై ఈ సినిమాలు తీశారా.. వాటిని చూస్తే మతిపోతుంది..?

అయినా సరే చరణ్ తన నటనలోని వేరొక కోణాన్ని చూపించాడు.ఇప్పుడు ఈ హీరో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ "గేమ్ ఛేంజర్"లో నటిస్తున్నాడు.

Advertisement

ఇందులో చరణ్ రామ్ నందన్ ఐఏఎస్/ అప్పన్న/ విజయ్ వంటి పాత్రల్లో కనిపించనున్నాడు.ఈ చిత్రం రూ.450 కోట్లతో రూపొందింది.శంకర్ తీసిన ఈ సినిమా చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని దీని నిర్మాత దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని ఇతరులు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఆ సంగతి పక్కన పెడితే రామ్‌ చరణ్ బుచ్చిబాబుతో కలిసి ఒక స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం తీస్తున్నాడు.దీనికి సుకుమార్ కథ అందించాడట.ఇది రంగస్థలం లాంటి ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అని చెబుతున్నారు.

రాజమౌళి ఈ మూవీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని కామెంట్లు చేసిన తర్వాత దీనిపై బాగా హైప్‌ పెరిగిపోయింది.ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని స్పోర్ట్స్ జానర్‌లో ఇది రాబోతోందట.

చెర్రీ ఇంతకుముందు పొలిటికల్, స్పోర్ట్స్ జానర్‌ను టచ్ చేయలేదు.కానీ ఇప్పుడు ఆ రెండు స్పెషల్ జానర్లను టచ్ చేస్తున్నాడు.

వాటితో ఎంతలా అలరించనున్నాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

తాజా వార్తలు