రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సినిమా ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ ( స్పానిష్ సినిమా కు ప్రీమేక్‌)

రామ్‌ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.దిల్‌ రాజు ఈ సినిమా యొక్క నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నాడు.

దిల్ రాజు యొక్క క్రేజీ ప్రాజెక్ట్‌ ల్లో ఇది ఒకటి.ఈ సినిమా దాదాపుగా మూడు వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక రామ్‌ చరణ్ తదుపరి సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఉండాల్సి ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

దాంతో వెంటనే ఉప్పెన చిత్రం తో సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకున్న బుచ్చి బాబు దర్శకత్వం లో సినిమాను చేసేందుకు రామ్‌ చరణ్ ఓకే చెప్పాడు.ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో రామ్‌ చరణ్‌ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

Advertisement

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చి బాబు ఈ సినిమా ను ఒక స్పానిష్‌ సినిమా కు ప్రీమేక్ గా చేస్తున్నట్లుగా తెలుస్తోంది.రామ్‌ చరణ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఆ సినిమా యొక్క కథ ను మార్చి స్క్రీన్‌ ప్లేను మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చారట.

తెలుగు లో మాత్రమే కాకుండా ఈ సినిమా ను అన్ని ఇండియన్‌ భాష ల్లో ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం రామ్‌ చరణ్‌ చేస్తున్న శంకర్‌ సినిమా షూటింగ్‌ మార్చి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది.ఆ వెంటనే బుచ్చి బాబు దర్శకత్వం లో చరణ్ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ తో సినిమా కోసం ఏడాది పాటు వెయిట్‌ చేసిన దర్శకుడు బుచ్చి బాబు ఎట్టకేలకు రామ్‌ చరణ్‌ యొక్క సినిమా ఛాన్స్ ను దక్కించుకున్నాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా చరణ్‌ తో బుచ్చి బాబు సినిమా ఉంటుందట.

ఇక ఆ స్పానిష్‌ మూవీ ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు