బోయపాటి పై భారం వేసి వెయిట్‌ చేస్తున్న యంగ్ హీరో.. హిట్‌ పడకుంటే కష్టమే!

ఎనర్జిటిక్ స్టార్‌ రామ్‌ హీరోగా రూపొందుతున్న బోయపాటి సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా బోయపాటి ప్రస్తుతం ఈ సినిమాను రూపొందిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం బోయపాటి మరియు రామ్‌ కాంబో మూవీ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఇస్మార్ట్‌ శంకర్ సినిమా తర్వాత ఇప్పటి వరకు రామ్‌ సక్సెస్ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు.

ఇక బోయపాటి గత చిత్రం అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.కనుక అఖండ విజయాన్ని పునరావృతం చేసేందుకు గాను దర్శకుడు బోయపాటి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

రామ్‌ కు వెంటనే ఒక సక్సెస్ కావాలి.గత చిత్రం ది వారియర్‌ పై చాలా ఆశలు పెట్టుకుంటే బొక్క బోర్లా పడింది.

Advertisement

కానీ ఈ సినిమా అలా కాకూడదు అనే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని కథను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.అతి త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.రామ్‌ ను మాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా దర్శకుడు బోయపాటి చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

రామ్ మరియు బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న సినిమా కు ప్రస్తుతం ఉన్న బజ్ నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.రామ్ మరియు బోయపాటి ల కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ను దసరా సీజన్‌ లో విడుదల చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.

రామ్ సినిమా అనగానే ఒక వర్గం ఆడియన్స్ లో ఆసక్తి ఉంటుంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు