ఎవరైనా సరే దొంగతనంగా ఎలాంటి పనులు చేస్తారు చెప్పండి దొంగతనంగా మందు తాగుతారు.దొంగతనంగా ఎవరికి తెలియకుండ పేకాట, గుర్ర పందాలు లాంటివి కూడా ఆడతారు.
కానీ ఎవరైనా దొంగతనంగా సేవ చేస్తారా ? ఇంట్లో ఎవరికి తెలియకుండా ఆ దొంగతనంగా దానాలు చేస్తారా.? చేసేవారు ఉన్నారు.అలా చేసే వ్యక్తి మరెవరో కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి నటుడు రాళ్లపల్లి.
మహానటి లాంటి సావిత్రి( Savitri ) సినిమా తీశారు అంటే ఆమె జీవితంలో ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి అలాగే కష్టాలు ఉన్నాయి.ఆమె హీరో కన్నా కూడా గొప్ప వ్యక్తి.
అందుకే ఆమె దాన గుణం, ఆమె వ్యక్తిత్వమే ఆమెను మహానటిని చేసి ఈరోజు మన ముందుకు సినిమా రూపంలో వచ్చేలా చేశాయి.అలా మహానటి సావిత్రి కి ఏ మాత్రం తీసిపోరు నటుడు రాళ్లపల్లి( Rallapalli ).తన దగ్గరికి ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ లేదా చిన్న నటుడు వచ్చి తన కుటుంబంలో ఎవరికైనా బాలేదు అలాగే తనకు ఏదైనా సమస్య ఉంది అని చెప్తే చాలు.కుటుంబ సభ్యులకి ఎవరికీ తెలియకుండా ఇంట్లో డబ్బులు లేకపోయినా సరే సామాన్లు అమ్మి మరీ దానం చేసేవారట.
ఎవరైనా ఏదైనా లేదు అని చెప్తే చాలు ఆయన మనసు కరిగిపోయి అది వారికి ఇచ్చేవరకు ఊరుకునేవారు కాదట.
ఆయన గొప్పతనం గురించి మరొక సంఘటన చెప్పాలి ఊటీలో షూటింగ్ జరుగుతుంది అక్కడ విపరీతమైన వర్షంలో షూటింగ్ ప్యాక్ అప్ జరిగి తన రూమ్ కి వచ్చేసి కిటికీ దగ్గర నిలబడి టీ తాగుతున్నారు ఆ సమయంలో కింద వర్షంలో చలికి వణుకుతున్న జూనియర్ ఆర్టిస్టుని చూసి మనసు చలించిపోయిన రాళ్లపల్లి అప్పటికప్పుడే వెళ్లి 100 శాలువాలు కొని జూనియర్ ఆర్టిస్టులకు పంచి పెట్టాడట.ఆ సినిమాకు ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్( Remuneration ) 10000 అక్కడే ఖర్చు చేసి ఇంటికి వెళ్లిపోయాడట.
కొన్ని సమాజాన్ని ఒకే రకంగా ప్రేమించిన వ్యక్తి కేవలం రాళ్లపల్లి మాత్రమే.చాలామంది ఈ సినిమా వాళ్లు ఎక్కువగా కష్టపడరు సుఖంగా ఉంటారు అనుకుంటారు కానీ వారికే కన్నీటి విలువ కష్టాల విలువ తెలిసి ఉంటుంది సాటి మనిషికి సాయం గొప్ప గుణం కూడా కలిగి ఉంటారు.అందుకు రాళ్లపల్లి జీవితమే ఒక ఉదాహరణ.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy