స్టార్ హీరోయిన్ తో ఉపాసన వంటకాలు..?

మెగా ఫ్యామిలీ సినీ పరిశ్రమలో కాకుండా బయట విషయాలలో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన సంగతే.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటారు.

తమకు సంబంధించిన విషయాలను, ఏదైనా వేడుకలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇదిలా ఉంటే మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా బయట విషయాలలో యాక్టివ్ గా ఉండటంతోపాటు.

ఈ మధ్య వంటకాలను పరిచయం చేస్తుంది.కొణిదెల ఉపాసన ఇటీవలే సోషల్ మీడియాలో యువర్ లైఫ్ డాట్ అనే పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇక ఇందులో లైఫ్ స్టైల్, హెల్త్ విషయాల పట్ల ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తుంటుంది.అంతేకాకుండా ఉపాసన అపోలో సేవల గురించి అందిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

Advertisement

ఇక సోషల్ మీడియాలో ఉపాసన ఎప్పటికప్పుడు లైఫ్ స్టైల్ సంబంధించిన విషయాలను, యోగాసనాలను చూపిస్తూ ఉంటుంది.ఇక తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తో వంటకాన్ని పరిచయం చేయించింది.

ఇంతకీ ఆమె ఎవరో కాదు.టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.

ప్రస్తుతం రకుల్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.ఖాళీ సమయాల్లో కొన్ని లైఫ్ స్టైల్ విషయంలో పాల్గొంటుంది.

తన శరీర ఫిట్నెస్ గురించి ఎన్నో విషయాలు పంచుకుంటుంది.ఇక తాజాగా ఉపాసనతో కలిసి వంటల కార్యక్రమంలో పాల్గొన్నది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

అందులో ఓ స్పెషల్ వంటకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన రకుల్.తను చేసిన వంటకం పంజాబీ డిష్ అని, రోటి పాలక్ తరహాలో పచ్చని ఆకుకూరలతో ఈ వంటకాన్ని ప్రిపేర్ చేసింది.

Advertisement

ఇక ఉగాది సందర్భంగా ఈ వంటకాన్ని పరిచయం చేశారట.ఇక ఈ వంటకం ను ఎలా తయారు చేసుకోవాలో కూడా తన వెబ్ సైట్ లో.వీడియో అప్లోడ్ కూడా చేశామని తెలిపారు.ఇదిలా ఉంటే ఉపాసన మరో టాలీవుడ్ బ్యూటీ సమంతతో కలిసి ఆరోగ్యకరమైన వంటకాలు చేసిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు