రాజోలు పంచాయ‌తీ వార్‌లో జ‌న‌సేన హ‌వా... ప‌వ‌న్ పార్టీ బ్లాక్ బ‌స్ట‌ర్ !

నాలుగో విడత పంచాయ‌తీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.

నాలుగో విడతలో మొత్తం 82.85 శాతం పోలింగ్ నమోదు కాగా నాలుగు దశలు కలిపి 81.78 శాతం నమోదు అయింది.తాజాగా 2,743 సర్పంచ్‌, 22,423 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరిగింది.

వైసీపీ, టీడీపీ మధ్య బారీ పోటాపోటీ నెలకొంది.పలుచోట్ల టీడీపీ హావా కొనసాగితే.

కొన్ని చోట్ల వైసీపీ జోరు కనబర్చింది.అయితే.

మ‌రికొన్ని చోట్ల జ‌న‌సేన కూడా పుంజుకోవ‌డం గ‌మ‌నార్హం.ఇప్పటివరకూ విడుదలైన ఫలితాలు ఇలా ఉన్నాయి.

Advertisement
Rajolu Janasena Grand Success In Panchayati War Pawan Party Janasena Grab The Vo

 టీడీపీ 400, వైసీపీ 611, జనసేన 20, బీజేపీ 6, ఇతరులు 55 స్థానాల్లో విజయం సాధించారు.ఇక‌, ఎక్క‌డ.

 ఎక్క‌డ‌.మా అభ్య‌ర్థుల గెలుపు ఎక్క‌డ‌? అని వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూసిన జ‌న‌సేన‌కు ఒకింత ఆశ‌లు ఫ‌లించిన‌ట్టే తెలుస్తోంది.తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించింది.

పది స్థానాల్లో జనసేన మ‌ద్ద‌తు దారులుగా నిల‌బ‌డిన అభ్యర్థు లు విజయం సాధించారు.పడమటిపాలెం(జనసేన), టెకిశెట్టిపాలెం(జనసేన), కేశవాదాసు పాలెం (జనసేన), కాట్రేనిపాడు(జనసేన), ఈటుకూరు (జనసేన), మేడిచర్ల పాలెం (జనసేన ), బట్టేలంక(జనసేన), రామరాజులంక(జనసేన), కత్తిమండ(జనసేన), కూనవరంలో జనసేన మ‌ద్ద‌తు దారులు గెలుపు గుర్రం ఎక్కారు.

Rajolu Janasena Grand Success In Panchayati War Pawan Party Janasena Grab The Vo

దీంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.జనసేన పార్టీ ప్రభంజనం ఈ నియోజకవర్గం నుంచే ప్రారంభమైందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపు తమదేనని హర్షం వ్యక్తం చేశారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన అభ్య‌ర్థి విజ‌యం సాధించారు.త‌ర్వాత పార్టీలో ఉన్నారా?  లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.రాజోలు జ‌నాలు మాత్రం జ‌న‌సేన‌తోనే ఉన్నార‌నేది ఒకింత ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చే ప‌రిణామంగానే చూడాలి.

Advertisement

ఇది ప‌వ‌న్ పార్టీ సాధించిన బ్లాక్ బ‌స్ట‌ర్‌గానే చెప్పుకోవాలి.ఇక‌, ఈ ఫ‌లితాల అనంత‌ర‌మైనా పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తుందా?  లేదా?  పుంజుకునేందుకు క‌స‌ర‌త్తు చేస్తుందా?  చేయ‌దా? అనేది చూడాలి.

తాజా వార్తలు