కిడ్నీలో రా‌ళ్ల‌ను క‌రిగించే రాజ్మా.. మ‌రిన్ని బెనిఫిట్స్ కూడా!

కిడ్నీలో రాళ్లు.నేటి కాలంలో వ‌య‌సు సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల‌ కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డుతుంటాయి.ఇక ఈ స‌మ‌స్య ఉన్న వారికి విపరీతమైన నొప్పి క‌ల‌గ‌డ‌మే కాకుండా మూత్ర విసర్జన చేయ‌డం కూడా చాలా క‌ష్ట‌త‌రంగా ఉంటుంది.

అయితే ఈ స‌మ‌స్య‌ను ముందే గుర్తించి స‌రైన జాగ్ర‌త్త‌లు పాటిస్తే.సులువుగా కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించుకోవ‌చ్చు.అయితే రాజ్మా కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

రాజ్మా.వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు.

Advertisement

కిడ్నీలో రాళ్లు ఉన్న వారు రాజ్మాను డైట్‌లో చేసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెడుతున్నారు.దాంతో రాజ్మాలో ఉండే ప్రోటీన్‌, ఫైబ‌ర్ మ‌రియు ఇత‌ర పోష‌కాలు కిడ్నీలో రాళ్ల‌ను క‌రిగించేస్తారు.

కిడ్నీలో రాళ్లు క‌రిగించ‌డ‌మే కాదు. రాజ్మాతో మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

రాజ్మాలో ఉండే మెగ్నీషియం మ‌రియు పొటాషియం రక్తప్రసరణ మెరుగుప‌రిచి అధిక ర‌క్త‌పోటు మ‌రియు గుండె జ‌బ్బుల నుంచి ర‌క్షిస్తుంది.అలాగే చాలా మంది మ‌తిమ‌రుపు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు.

అలాంటి వారు రాజ్మా తీసుకుంటే.అందులో ఉండే బీ1 విట‌మిన్ జ్ఞాప‌క శ‌క్తిని పెంచుతుంది.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
కొరియన్ భర్తకి పరీక్ష పెట్టిన ఇండియన్ భార్య.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..

రాజ్మాను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య కూడా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.ఇక రాజ్మాను తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

Advertisement

అందువ‌ల్ల, మ‌ధుమేహం రోగులు రాస్మాను తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.అయితే రాజ్మాను అతిగా తీసుకోరాదు.

ఎందుకంటే, రాజ్మాను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే `ఫైటోహెమగ్లుటినిన్` అనే కొవ్వు పదార్థం జీర్ణం కావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది.ఈ క్ర‌మంలోనే గ్యాస్‌, ఎసిడిటీ స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అలాగే ఉడికీ ఉడ‌క‌ని రాజ్మాను కూడా తీసుకోరాదు.దీని వ‌ల్ల క‌డుపు నొప్పి స‌మ‌స్య వ‌స్తుంది.

తాజా వార్తలు