Rajinikanth Jailer : ఒక రేంజ్ తర్వాత మాటలుండవ్ కోతలే.. జైలర్ తో రజనీ కోరుకున్న హిట్టొస్తుందా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా( Tamannaah ) కలిసి నటించిన తాజా చిత్రం జైలర్‌( Jailer ).

ఈ మూవీకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన విషయం తెలిసిందే.

ఇందులో రమ్యకృష్ణ, సునీల్‌, బాలీవుడ్‌ నటులు సంజయ్‌ దత్‌, జాకీష్రాప్‌, శాండల్‌వుడ్ స్టార్‌ నటుడు శివరాజ్‌ కుమార్‌, మోహన్ లాల్, యోగిబాబు ప్రధానపాత్రల్లో నటించారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

ట్రైలర్‌ చూస్తే జైలర్( Jalier Trailer ) ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ట్రైలర్ ప్రారంభంలోనే కాల్పులు, బాంబు మోతలతో దద్దరిల్లింది.ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.

Advertisement

కోతలే అంటూ రజినీకాంత్( Rajinikanth ) డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది.ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 10న గ్రాండ్గా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సందర్బంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్నారు.విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

ఇకపోతే ఇటీవల ఈ మూవీ నుంచి విడుదల అయిన కావలయ్యా సాంగ్( Kavalayya Song ) ఎంతటీ విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే.ఎక్కడ చూసినా కూడా ఈపాటే వినిపిస్తోంది.ఇప్పటికే కొన్ని వందల రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

ఇకపోతే సాధారణంగా చిత్రాల్లో హీరోలకు ఇంట్రో సాంగ్‌ ఉంటుంది.అయితే జైలర్‌ చిత్రంలో నటి తమన్న ఇంట్రో సాంగ్‌లో మెరవబోతుండటం విశేషం.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

తమన్నా సాంగ్‌ కచ్చితంగా జైలర్‌ చిత్రానికి ప్రత్యేక తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు