యంగ్ డైరెక్టర్‌తో ఓకే అంటోన్న తలైవా

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి డైరెక్టర్‌తోనూ సినిమా చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం తమిళ దర్శకుడు శివ డైరెక్షన్‌లో అన్నాత్తై అనే సినిమాలో నటిస్తోన్నాడు.

పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో తమిళ తంబీలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో రజినీ ఎలాంటి పాత్ర చేస్తాడా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

Rajinikanth Next Movie With Karthik Subbaraj, Rajinikanth, Karthik Subbaraj, Ann

కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని తాజాగా ఓకే చేశాడట రజినీ.గతంలో తలైవా నటించిన ‘పేట’ చిత్రం ఎలాంటి హిట్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే.

ఆ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశాడు.ఆయన డైరెక్షన్ బాగా నచ్చడంతో ఆయనతో మరో సినిమా చేస్తానని గతంలోనే రజినీ మాటిచ్చాడట.

Advertisement

ఇక ఇటీవల పెంగ్విన్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ ఓ అదిరిపోయే కథను రజినీకి వినిపించాడట.దీంతో ఆయనకు ఈ సినిమా కథ బాగా నచ్చడంతో కార్తీక్ సుబ్బరాజ్‌తో సినిమా చేసేందుకు ఓకే అన్నాడట.

ఇక రజినీతో సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ అదిరిపోయే ప్లాన్ వేస్తున్నాడట.అంతేగాక ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.

కార్తీక్ సుబ్బరాజ్ తమిళంలో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీలుగా నిలవడమే కాకుండా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే రజినీతో మరో సినిమా చేసేందుకు ఆయన రెడీ కావడంతో ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

స‌మ్మ‌ర్‌లో ఈ స‌లాడ్స్ తింటే..ఆ జ‌బ్బులు ద‌రిచేర‌వ‌ట‌?
Advertisement

తాజా వార్తలు