ఒకప్పుడు చిరంజీవి( Chiranjeevi ) పక్కన చాలా సినిమాల్లో నటించి తెలుగు లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సుమలత( Sumalata ) గారి గురించి మన అందరికీ తెలిసిందే.
ఇక గత కొంత కాలం గా సినిమాలకి దూరం గా ఉంటున్న ఆవిడ రీసెంట్ గా కొడుకుకి పెళ్లి చేశారు దాంతో ఆయన్ని ఒక ఇంటివాడ్ని చేశారు.
ఇక సుమలత తన భర్త అంబరీష్ మరణాంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె సినిమాల వైపు మళ్లీ చూడలేదు.ఇక ఇప్పుడు తన కొడుకు అభిషేక్ వివాహాన్ని అవీవా తో చాలా ఘనంగా జరిపించారు.
ఈ వివాహ వేడుకకు తారా లోకం సతీసమేతంగా హాజరవడం చూడముచ్చటగా అనిపిస్తోంది.ఈ వివాహ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) ఆయన సతీమణి లతతో కలిసి హాజరవ్వగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన తనయుడు మంచు విష్ణు కూడా ఈ వివాహానికి హాజరయ్యి సందడి చేశారు.
అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఇకపోతే సుమలత కొడుకు అభిషేక్( Abhishek ) కూడా నటుడు కావడంతో అమర్ అనే చిత్రం ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.
ఇక పెళ్లికూతురు అవీవా ఫ్యాషన్ డిజైనర్ కం మోడల్ వీరి వివాహం జూన్ 5 అనగా సోమవారం రోజు జరగగా ఇక రిసెప్షన్ బెంగళూరులో జూన్ 7 అనగా బుధవారం రోజు చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారు.ఇకపోతే ఈ వివాహానికి సినీ రాజకీయ నాయకులతోపాటు క్రికెటర్ అనిల్ కుంబ్లే , కన్నడ స్టార్ యష్ , సుహాసిని , మణిరత్నం ఇలా పలువురు హాజరయ్యారు.
ఇంకా సుమలత భర్త అంబరీష్ తో కూడా వీరందరికీ మంచి అనుబంధం ఉంది.అంబరీష్ మరణాంతరం సుమలత తన కొడుకు అభిషేక్ ఇద్దరు ఒంటరిగానే జీవిస్తున్నారు.ఇక ప్రస్తుతం సుమలత కర్ణాటకలోని మాండ్యాలో ఎంపీగా పనిచేస్తున్నారు.
ఇక ఈ మేరకు తన కొడుకు పెళ్ళికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆమె ఆహ్వానించగా ఆయన నూతన దంపతులను ఆశీర్వదించారు.అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ చిరంజీవి తో చాలా సినిమాల్లో నటించిన సుమలత చిరంజీవి ని పెళ్లి కి పిలవలేదు అని తెలుస్తుంది.
ఆయన్ని ఎందుకు పిలవలేదు అనే విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి.
ఇకపోతే సుమలత ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని రజినీకాంత్ వరకు చాలామంది హీరోలతో కలిసి నటించింది.సుమలత కొడుకు కూడా పలు సినిమాలలో నటించి ఇప్పుడు పెళ్లి కారణంగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చాడు.త్వరలోనే మహేష్ కుమార్ దర్శకత్వంలో ఆయన కొత్త సినిమా షూటింగ్ మొదలుకానుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy