ఇటీవల సమాజంలో సహజీవం అనేది చాలా సాధారణ విషయమైపోయింది.
అయితే ఈ క్రమంలో మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది అని రాజస్థాన్ మానవ హక్కుల కమీషన్ వాపోయింది.
సహజీవనం పేరుతో మహిళలను వాడుకొని వదిలేస్తున్నారు అని కావున ఈ బంధాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేదించాలని పేర్కొంది.రాజస్థాన్ మానవహక్కుల కమీషన్ బెంచ్ న్యాయమూర్తులు మహేష్ చంద్ శర్మ,ప్రకాశ్ తాంతియాలతో కూడిన ధర్మాసనం సహజీవనంపై పై విధంగా స్పందించింది.
ఈ క్రమంలో సహజీవనం పై బెంచ్ తీవ్రంగా స్పందించింది.సహజీవనం పేరుతో ఆడవారిని కేవలం ఆట బొమ్మలుగా చేసి వాడుకొని వదిలేస్తున్నారు అని బెంచ్ అభిప్రాయపడింది.
సహజీవనం గురించి మాట్లాడుతున్న సందర్భంలో బెంచ్ ఓ ఉదాహరణను కూడా ప్రస్తావించింది.వివాహితులైన పురుషులు కేవలం లైంగిక సంబంధం కోసం లేదా ఓ పనిమనిషిలా వాడుకోవడం కోసం మరో మహిళతో సహజీవనం నడుపుతున్నారని దీనితో ఈ సహజీవనంలో మహిళల పరిస్థితి ఉంపెడుగత్తెల్లా మారిపోయిందని వ్యాఖ్యానించింది.
అలానే ఆర్టికల్ 21లో పేర్కొన్న మానవ హక్కులకు ఇది విరుద్దం అని వ్యాఖ్యానించిన బెంచ్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సహజీవనం బంధాలను నిషేధించాలి అంటూ సూచించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy