ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న ఆగిపోయిన సినిమా

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వాటిని సూపర్ హిట్‌లుగా మలుస్తున్నాడు.

గరుడవేగ, కల్కి వంటి చిత్రాలతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న రాజశేఖర్ ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.

అయితే అందరినీ అవాక్క చేస్తూ రాజశేఖర్ సినిమా ఒకటి రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఆయన సినిమా ఎప్పుడు మొదలుపెట్టాడు, ఎప్పుడు పూర్తి చేశాడని చాలా మంది అనుకుంటున్నారు.అయితే వాస్తవానికి ఇది ఇప్పటి సినిమా కాదు.2011లో రాజశేఖర్ హీరోగా ఓ సినిమా షూటింగ్ జరుపుకుంది.ఆ సినిమాను తమిళ డైరెక్టర్ కన్మణి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

Rajasekhar Arjuna Movie Finally To Release-ఎట్టకేలకు రి�

అయితే అప్పట్లో రాజశేఖర్ ఏది చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేది.దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆలోచించి వెనకడుగు వేశారు.

కాగా గరుడవేగ సినిమాతో మళ్లీ సూపర్ ఫాంలోకి రావడంతో రాజశేఖర్ నటించి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.అర్జున అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడు.

Advertisement

పూర్తి పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.మరి ఇప్పుడైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.

స‌మ్మ‌ర్‌లో ఈ స‌లాడ్స్ తింటే..ఆ జ‌బ్బులు ద‌రిచేర‌వ‌ట‌?
Advertisement

తాజా వార్తలు