రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ గా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి సాయికిరణ్ నాయక్ ను నియమిస్తూ ఆదివారం నియామక పత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ అందజేశారు.
ఈ సందర్భంగా నియమాక పత్రాన్ని అందుకున్న సాయికిరణ్ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ గా బాధ్యతలను అప్పగించిన జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ గంగిడి మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి కి ధన్యవాదములు తెలియజేశారు.
నాకు ఈ బాధ్యత అప్పగిoచినoదుకు బీజేపీ పార్టీ సిద్ధాంతానికి అంకిత భావంతో నీతి, నిజాయితి, నిబద్దత, క్రమశిక్షణ, చిత్త శుద్ధితో పని చేస్తాననీ అలాగే అన్ని కార్యాక్రమాలలో,చురుగ్గా పాల్గొని ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని అన్నారు.బిజెపి పార్టీలో నమ్మిన సిద్ధాంతానికి అహర్నిశలు కృషి చేసి బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాకు ఎన్నో కేసులను ఎదుర్కొన్న తనపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలను కార్యచరణతో నిర్వహిస్తానని అన్నారు.
బి ఆర్ ఎస్ పాలన లో జరిగే అవినీతి,అక్రమాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తానని అలాగే జిల్లాలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలను ప్రజలకు తెలిసేవిధంగా కృషి చేస్తానని అన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy