రాజమౌళి కొడుకు ప్లాన్‌ ఏంటీ? ‘ఆకాశవాణి’ దేని గురించి?

రాజమౌళి ఏ సినిమా చేసినా పక్కా ప్రణాళికతో, ఎంతో జాగ్రత్తగా, ముందస్తు వర్క్‌ ఎంతో చేసి ఆ తర్వాత మొదలు పెడతాడనే విషయం తెల్సిందే.

తాజాగా ప్రారంభించిన ఆర్‌ మల్టీస్టారర్‌ మూవీ కోసం దాదాపు సంవత్సర కాలంగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరిపాడు.

తండ్రికి తగ్గ తనయుడు అన్నట్లుగా కార్తికేయ కూడా వ్యవహరిస్తున్నాడు.రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఏం చేసినా కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుని మరీ చేస్తాడు.

సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని రంగాల్లో కూడా అద్బుతమైన ప్రావిణ్యంను దక్కించుకున్న కార్తీకేయ ప్రస్తుతం పూర్తి స్థాయి నిర్మాతగా మారేందుకు సిద్దం అయ్యాడు.

తన బ్యానర్‌లో ‘ఆకాశవాణి’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.షూటింగ్‌ ఇంకా ప్రారంభించకుండానే నిర్మాత ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది.

Advertisement

అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది.ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చాలా విభిన్నంగా ఉంది.

కొందరు ఆకాశం వైపు చూస్తున్న ఫొటో సినిమా కథ ఏంటా అంటూ ఆసక్తిని కలిగిస్తోంది.ఈ చిత్రంలో అసలు దేని గురించి చూపిస్తారు, కథ ఏంటో అంటూ చర్చ జరుగుతోంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇదో పీరియాడిక్‌ మూవీ అని, తప్పకుండా యూత్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.అద్బుతమైన స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్స్‌తో ఈ చిత్రం ఉంటుందంటున్నారు.సాయి మాధవ్‌ బుర్రా ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు.

దాంతో ఆసక్తి మరింతగా పెరుగుతోంది.

Advertisement