రాజమౌళి ఈ సీన్ ని ఆ సినిమా నుంచి కాపీ కొట్టాడా...?

తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి.

ఆయన తీసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా అవార్డులు వస్తున్నాయి.

ఇప్పటికే నాటు నాటు అనే సాంగ్ ఆస్కార్ కి ఒక్క అడుగు దూరం లో ఉంది.ఇది ఇలా ఉంటే రాజమౌళి తన కెరియర్ మొదట్లో తీసిన సినిమాల్లో తనకి బాగా నచ్చిన సినిమా విక్రమార్కుడు ఈ సినిమాలో రవితేజని కామెడీ అండ్ సీరియస్ గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో చూపించి ఈ సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా మలిచారు.

ఈ సినిమా చాలా బాషల్లో రీమేక్ అయింది రీమేక్ అవడం కాకుండా ప్రతి భాషలో బిగ్గెస్ట్ హిట్టు గా నిలిచింది.అయితే చాలా సంవత్సరాల నుంచి రాజమౌళి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఈ సినిమాకు సంభందించిన ఒక న్యూస్ తెగ వైరల్ అయింది.

అదేంటి అంటే ఈ సినిమాలో రౌడీ కొడుకుకి పిచ్చి ఉందని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నైట్ పార్టీ చేసుకుంటుంటే దానికి మినిస్టర్ కూడా వస్తాడు మినిస్టర్ కి సెక్యూరిటీ గా విక్రమ్ రాథోడ్ (రవితేజ) వస్తాడు అయితే ఆ రౌడీ కొడుకు పోలీస్ వాళ్ళతో ఒక ఆట ఆడుతాడు అదే ఆట హీరో వరకు వస్తుంది అది నచ్చని హీరో తన దగరికి రౌడీ పరుగెత్తుకుంటూ వస్తుంటే కింద బుల్లెట్స్ విసిరేసాడు వాటిమీద కాలు వేసిన రౌడీ స్లీప్ అయి కిందపడి చనిపోతాడు.

Rajamouli Copied Vikramarkudu Scene From Vijayashanti Sambhavi Ips Movie Details
Advertisement
Rajamouli Copied Vikramarkudu Scene From Vijayashanti Sambhavi Ips Movie Details

అయితే ఇదే సీన్ మీద చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది రాజమౌళి ఈ సీన్ ని విజయశాంతి మేన్ రోల్ లో నటించిన శాంభవి ఐ పి ఎస్ సినిమా నుంచి అస్ ఇట్ ఇస్ గా కాపీ చేసాడు అని చాలా మంది రాజమౌళిని విమర్శిస్తుంటారు.ఈ విషయం మీద రాజమౌళి చాలాసార్లు వివరణ ఇచ్చారు అది ఎంటి అంటే విజయశాంతి చేసిన శాంభవి ఐ పి ఎస్ సినిమా స్టోరీ రైటర్ రాజమౌళి వాళ్ళ నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ గారు

Rajamouli Copied Vikramarkudu Scene From Vijayashanti Sambhavi Ips Movie Details

అప్పట్లో ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ రాజమౌళి కి మాత్రం ఈ సినిమా లో ఈ ఒక్క సీన్ అంటే చాలా ఇష్టం ఉండేది.అనుకోకుండా తను చేస్తున్న విక్రమార్కుడు సినిమాలో కూడా అలాంటి సీన్ కి స్కోప్ ఉండడం వల్ల ఆ సీన్ ని ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరక్టర్ల అందరి పర్మిషన్స్ తీసుకొని మా సినిమాలో పెట్టుకున్నాం అని చెప్పినా కూడా వినకుండా చాలా మంది ఇప్పటికీ రాజమౌళి మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు కానీ రాజమౌళి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు