విశాఖ వేదికగా జరిగే రెండో వన్డే కు వర్ష గండం.. క్రికెట్ ప్రేక్షకులకు నిరాశ..!

భారత్- ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ లొ తొలి మ్యాచ్ మార్చి 17 శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.

ఆ తర్వాత రెండో వన్డే 19వ తేదీ విశాఖపట్నంలో ( Visakhapatnam )జరగనున్న సంగతి తెలిసిందే.

రెండో మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.కానీ రెండో మ్యాచ్ కు వాతావరణ శాఖ గట్టి షాక్ ఇచ్చింది.19వ తేదీ వర్షం పడే ఛాన్స్ ఉంది.ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీనితో ఇరుజట్లకే కాకుండా, ప్రత్యక్షంగా మ్యాచ్ ను తిలకించాలి అనుకునే వైజాగ్ క్రికెట్ అభిమానులు సైతం నిరాశకు గురయ్యే ఛాన్స్ ఉంది.ఇప్పటికిప్పుడు బ్యాచ్ జరిగే వేదికను మార్చడం కష్టం.

దీనిపై బీసీసీఐ కూడా చేతులెత్తేసింది.

Advertisement

వర్షం పడకపోతే మ్యాచ్ జరగనుంది.వర్షం పడితే మ్యాచ్ రద్దు అవుతుంది.ఇందులో ఎటువంటి మార్పు లేదు.

భారత్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ( Border–Gavaskar Trophy ) టైటిల్ ను సాధించలేకపోయింది.కనీసం 3 వన్డేల మ్యాచ్ లలో గెలిచి టీం ఇండియాను క్లీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది.

మరొకవైపు భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నీ సొంతం చేసుకుని, జరగనున్న 3 వన్డేల సిరీస్ లో కూడా ఆస్ట్రేలియన్ ఓడించి టైటిల్ సొంతం చేసుకోవాలని తెగ ఆరాటపడుతోంది.

అంతేకాకుండా భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డే సిరీస్ లలో రాణించి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత జట్టులో స్థానం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇవన్నీ జరగాలి అంటే కచ్చితంగా మూడు మ్యాచ్లు ఎటువంటి అంతరాయం లేకుండా జరగాల్సిందే.ఇక మూడవ వన్డే మార్చి 22న చెన్నైలో జరగనుంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ఇక ఆస్ట్రేలియా జట్టుకు( Australia ) స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనుండగా, భారత జట్టుకు తొలి మ్యాచ్ కు రోహిత్ దూరమవడంతో హార్దిక్ పాండ్యా, తరువాత రెండు మ్యాచ్లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు