ఒడిశా రైలు ప్రమాదంపై అలాంటి ట్వీట్ చేసి డిలీట్ చేసిన కమెడియన్?

తాజాగా ఒడిశాలో( Odisha ) జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిసి వేసింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఒకే ప్రదేశంలో దాదాపు మూడు రైళ్లు ప్రమాదానికి గురవడం, మాదాపూర్ 270 మందికి పైగా మృత్యువాత పడటం 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.ఆ ఘటన స్థలం అంతా కూడా ఏడుపులతో దద్దరిల్లిపోయింది.

ఆ ఘటనలో కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ భయంకరమైన రైలు ప్రమాదం గురించే వార్తలు ఫోటోలు వీడియోలు కనిపిస్తున్నాయి.

ఈ విషయం గురించి స్పందిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు.పలువురు సెలబ్రిటీలు( Celebrities ) సైతం ఈ ఘటనపై స్పందిస్తున్నారు.ఈ సమయంలో టాలీవుడ్ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ( Rahul Ramakrishna ) అనుచిత ట్వీట్‌ చేశాడు.

Advertisement

కాగా ఆ ట్వీట్ లో మండిపాటు సైలెంట్‌ అనే హాలీవుడ్‌ సినిమాలో నటుడు బస్టర్‌ కీటన్‌ ( Buster Keaton )రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోని షేర్‌ చేశాడు.దీంతో నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక పక్క వందల కుటుంబాలు ట్రైన్‌ యాక్సిడెంట్‌ లో సమాధి అయిపోతే మీకు కామెడీగా ఉందా? రైలు విన్యాసాలు షేర్‌ చేస్తున్నారేంటి? అని మండిపడ్డారు.

వెంటనే తప్పు తెలుసుకున్న రాహుల్‌ సదరు ట్వీట్‌ డిలీట్‌ చేసి క్షమాపణలు కోరాడు.సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు ఇంతకు ముందు చేసిన ట్వీట్‌పై క్షమాపణలు కోరుతున్నాను.ఒట్టేసి చెప్తున్నాను.

ఆ విషాదం గురించి నాకసలు ఏమీ తెలియదు.అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్‌ రాసుకునే పనిలో ఉన్నాను.

ప్రతిరోజు ఒక కప్పు కివి పండ్లు తింటే మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..

ఏ వార్తలూ చూడలేదు.అందుకే తప్పు జరిగింది.

Advertisement

మరోసారి క్షమాపణలు చెప్తున్నాను అని ట్వీట్‌ చేశాడు.దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను.

మిమ్మల్ని ట్రోల్‌ చేయాలనుకోలేదు.కేవలం మీకు ఆ ఘటన గురించి మరింత సమాచారం ఇవ్వాలనుకున్నాను అని చెప్పుకొచ్చాడు.

దీనికి రాహుల్‌ రిప్లై ఇస్తూ.థాంక్యూ.

గత కొన్ని గంటలుగా నేను న్యూస్‌ ఫాలో అవడం లేదు.కేవలం నా పనిపైనే ఫోకస్‌ చేశాను.

నన్ను అలర్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌ అని తెలిపాడు.

తాజా వార్తలు