హైదరాబాద్ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.

ఈ మేరకు నగరంలో రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగ్స్ ను రాహుల్ గాంధీ నిర్వహించనున్నారు.కాసేపట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షో చేయనున్న ఆయన కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.

తరువాత మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని, తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు వివరించనున్నారు.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

తాజా వార్తలు