ఉండి టికెట్ పై రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు..!!

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు( Raghuramakrishna Raju ) నిన్న పాలకొల్లు ప్రజాగళం సభలో టీడీపీలో జాయిన్ కావడం తెలిసిందే.

చంద్రబాబు పార్టీ కండువా కప్పి రఘురామకృష్ణరాజుని సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

దీంతో ఆయనకి ఉండి ఎమ్మెల్యే టికెట్( Undi Mla Ticket ) చంద్రబాబు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై తాజాగా రఘురామకృష్ణరాజు స్పందించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.ఉండి ఎమ్మెల్యే టికెట్ తనకేనని చంద్రబాబు( Chandrababu ) ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా రామ రాజుకేనని కూడా చెప్పలేదు.తప్పకుండా పోటీలో ఉంటా.

Advertisement

నేను కండిషన్ లు పెట్టి తెలుగుదేశం పార్టీలో చేరలేదు.అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా.

వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా.? ఎంపీగా పోటీ చేస్తానా.? అనేది కూడా చంద్రబాబు డిసైడ్ అవుతారు అంటూ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉండి నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున మంతెన రామరాజు గెలవడం జరిగింది.2004 మినహా ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలలో ఉండిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు.దీంతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే( Manthena Ramaraju ) టికెట్ అని మొదట్లో వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ గా రఘురామకృష్ణరాజు టీడీపీలో జాయిన్ అవ్వటంతో కొత్త కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి.రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.దీంతో తనకి చంద్రబాబు ఉండి ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు.

కేటీఆర్ కు అంత శక్తి ఉందా ? జగ్గారెడ్డి కౌంటర్ 
Advertisement

తాజా వార్తలు