పోసాని మాట‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన ర‌ఘురామ‌.. వైసీపీకి ఝ‌ల‌క్‌..

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దూమం రేపుతున్నాయి.ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

న‌టుడు ర‌చ‌యిత పోసాని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి కుట ప‌ట్టింపులు లేవ‌ని, అన్ని వ‌ర్గాలకు న్యాయం చేస్తున్నార‌ని కొనియ‌డారు.సీఎం జ‌గ‌న్ పాల‌నపై రాష్రంలోని ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉన్నార‌ని తెలిపారు.

న‌టుడు, ర‌చ‌యిత‌ పోసాని కృష్ణ‌మోర‌ళి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు త‌న‌దైన శైలిలో స్పందించారు.ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు మాత్రమే మంత్రి ప‌ద‌వులు, ఇత‌ర ప‌ద‌వులు ఇస్తార‌ని, త‌న కాబినెట్‌లో ఎంత మంది రెడ్డిలు ఉన్నారో లిస్ట్ విడుద‌ల చేశారు.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ త‌న అనుచ‌రుల‌తో ఇత‌రుల‌పై మాట‌ల దాడి చేయిస్తుంటార‌ని విమ‌ర్శించారు.

Advertisement
Raghuram Countered Posani's Words Shok To Ycp, Raghuram, Posani Krishna Murali,

జ‌న‌సేనా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు వ్య‌క్తిగ‌త జీవితంపై విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని ఎంపీ రాఘురామ తీవ్రంగా ఖండించారు.ప‌వ‌న్ పై మంత్రి పేర్నినాని అర్థం,ప‌ర్థం లేని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, అన‌వ‌స‌రంగా కుల‌ప్ర‌స్తావ‌న తీసుకొస్తున్నార‌ని విమ‌ర్శించారు.

బాధ్య‌త గ‌ల ప‌ద‌విలో ఉండి ఇలా వ్యాఖ్య‌నించ‌డం స‌రికాద‌న్నారు.ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితం మూడు పెళ్లిళ్లపై మంత్రి పేర్ని చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు.

విడాకులు ఇచ్చిన త‌రువాత మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటే త‌ప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.పేర్నినాని, పోసాని ఎదుటివారిని ఎత్తిచూపేట‌ప్పుడు మ‌న గురించి కూడా ఆలోచించాల‌ని హిత‌వు ప‌లికారు.

ఏపీ మంత్రులు నీచాతినీచంగా మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Raghuram Countered Posanis Words Shok To Ycp, Raghuram, Posani Krishna Murali,
నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?

ఇప్ప‌టికైనా ఇలాంటి వాటికి ఫుల్ స్టాఫ్ పెట్టాల‌ని పేర్నినానికి సూచించారు.మంత్రులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెడితే బాగుంటుంద‌ని తెలిపారు.అనేక కేసుల‌లో న్యాయ‌వాదుల‌కు కోట్లు ఇస్తున్నార‌ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు