Rudrudu Review: రుద్రుడు రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ కతిరేసన్( Director Kathiresan ) దర్శకత్వంలో రూపొందిన సినిమా రుద్రుడు.( Rudrudu Movie ) ఇందులో రాఘవ లారెన్స్, ప్రియా భవాని, శరత్ కుమార్ తదితరులు నటించారు.

కతిరేసన్ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.బి బ్యానర్ పై నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

ఆర్ డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా ఒక పాత కమర్షియల్ ఫార్మాట్ లో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

పైగా రాఘవ లారెన్స్ కు( Raghava Lawrence ) ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే.ఇందులో రాఘవర్ లారెన్స్ రుద్రుడు పాత్రలో కనిపిస్తాడు.

Advertisement

రుద్రుడు మామూలు ఉద్యోగం చేసుకునే వ్యక్తి.ఇక ఇతడు తను ఇష్టపడ్డ అమ్మాయి అనన్య (ప్రియా భవాని శంకర్) ను పెళ్లి చేసుకుంటాడు.

తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు.అయితే కొంతమంది దుండగులు తన భార్యను చంపేస్తారు.

దాంతో రుద్రుడి జీవితం మొత్తం నాశనం అవుతుంది.దీంతో తన భార్యను చంపింది ఎవరో తెలుసుకోవాలని చంపాలని నిర్ణయించుకుంటాడు.

అలా వారిని చంపాడా లేదా.అసలు వారు అనన్యను ఎందుకు చంపాలనుకున్నారు అనేది మిగిలిన కథలోనిది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

నటినటుల నటన:

రాఘవ లారెన్స్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఏ పాత్రకైనా పూర్తి న్యాయం చేస్తాడు.ఈ సినిమాలో రుద్రుడి పాత్రతో బాగానే ఆకట్టుకున్నాడు.

Advertisement

ప్రియ భవాని కూడా బాగా నటించింది.శరత్ కుమార్ నెగటివ్ పాత్రలో అద్భుతంగా చేశాడు.

మిగిలిన నటీనటులంత పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:

ఇక డైరెక్టర్ ఈ సినిమాను మామూలు కథతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.జీవి ప్రకాష్ అందించిన పాటలు కూడా మామూలుగానే ఉన్నాయి.

ఆర్డీ చాయాగ్రహణం కూడా పరవాలేదు అన్నట్లుగా ఉంది.నేపథ్య సంగీతం బాగుంది.

మిగిలిన సాంకేతిక విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

మామూలుగా ఈ తరం ప్రేక్షకులు సినిమాలలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు.అందుకే కొంతమంది దర్శకులు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కథను కొత్త కొత్తగా తీస్తున్నారు.కానీ కొంతమందికి దర్శకులు పాత కమర్షియల్ వంటి సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇప్పుడు అటువంటిదే రుద్రుడు సినిమా కూడా.ఇక ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎప్పటినుంచో చూస్తున్నాం అని ఫీలింగ్ కనిపిస్తుంది.

చాలావరకు రొటీన్ గా అనిపిస్తూ ఉంటుంది.కానీ మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించాడు దర్శకుడు.

ప్లస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాలు, నటీనటుల నటన, నేపథ్య సంగీతం.

మైనస్ పాయింట్స్:

రొటీన్ కథనం లాగా అనిపించింది.

బాటమ్ లైన్:

చివరగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టమని చెప్పాలి.అంటే పాత కమర్షియల్ సినిమా కాబట్టి సినిమా చూస్తున్నంత సేపు చూసినట్లుగానే అనిపిస్తుంది.

రేటింగ్: 2/5

తాజా వార్తలు