విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?

ఇటీవల యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌( United Airlines ) విమానం గాల్లో ఉండగా ఒక్కసారిగా ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అసలేం జరిగిందో తెలుసా, టేకాఫ్ తీసుకునే ముందు విమానం ఇంజన్‌లోకి కుందేలు( Rabbit ) దూరిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

అదృష్టం కొద్దీ పైలట్లు సమయానికి స్పందించి విమానాన్ని సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం తప్పింది.యూఏ 2325 విమానం డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం( Denver International Airport ) నుంచి ఎడ్మోంటన్‌కు బయలుదేరింది.

టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ( FAA ), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమాచారం ప్రకారం కుందేలు ఇంజిన్‌లోకి వెళ్లడం వల్లే కుడి ఇంజన్‌లో మంటలు వచ్చాయి.

న్యూయార్క్ పోస్ట్ సేకరించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లైవ్ ఆడియోలో పైలట్ ఏం చెప్పాడో వింటే షాక్ అవుతారు."యూనైటెడ్ 2325, మీ కుడి ఇంజిన్ నుంచి మంటలు వస్తున్నట్లు కనిపిస్తోంది" అని కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందింది.

Advertisement

వెంటనే సిబ్బంది స్పందిస్తూ "మేము కుడి ఇంజిన్‌ను కోల్పోయామని అనుకుంటున్నాం" అని తెలిపారు.పైలట్ స్పందిస్తూ "నెంబర్ 2 ఇంజిన్‌లోకి కుందేలు దూరింది, అదే జరిగింది" అని చెప్పడం విని అందరూ ఆశ్చర్యపోయారు.

విమానం పైకి ఎక్కుతుండగా పెద్ద శబ్దం వినిపించిందని, విపరీతమైన ప్రకంపనలు వచ్చాయని ఓ ప్రయాణికుడు భయాందోళనతో చెప్పాడు."కొన్ని సెకన్లకు ఒకసారి ఇంజిన్ నుంచి పెద్ద మంటలు వస్తున్నాయి.అందరూ భయంతో వణికిపోయారు" అని ఆందోళనగా తెలిపాడు.

మరో ప్రయాణికుడు మాట్లాడుతూ తాను చాలా భయపడ్డానని, విమానం కూలిపోతుందేమో అని అనుకున్నానని చెప్పాడు."నా గుండె ఆగినంత పనైంది.

విమానం ప్రమాదంలో పడటం చూస్తానని అనుకున్నాను" అని భయంకరమైన క్షణాలను గుర్తు చేసుకున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

ఈ విమానంలో 153 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.రాత్రి 8:05 గంటల ప్రాంతంలో పైలట్లు చాకచక్యంగా విమానాన్ని డెన్వర్‌లోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.ప్రయాణికులను వేరే విమానంలో ఎడ్మోంటన్‌కు పంపించారు.

Advertisement

యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, వన్యప్రాణి ఢీకొనడం వల్లే విమానం వెనక్కి వచ్చిందని తెలిపింది."డెన్వర్ నుంచి ఎడ్మోంటన్‌కు వెళ్లే మా విమానం ( UA2325 ) వన్యప్రాణి ఢీకొనడం వల్ల తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి సురక్షితంగా డెన్వర్‌కు తిరిగి వచ్చింది" అని ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

విమానాలు కుందేళ్లను ఢీకొట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.ఈ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తాజా వార్తలు