తల్లిదండ్రుల మధ్య గొడవ.. తండ్రిని హత్య చేసిన కొడుకు..!

ఇటీవలే కాలంలో మనుషులలో విచక్షణ జ్ఞానం లోపిస్తుంది.చిన్నచిన్న తప్పులకు, సమస్యలకు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుని కుటుంబాన్ని రోడ్డున పడుతున్నారు.

సమస్యలు ఉండని కుటుంబం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు.సమస్యలు వచ్చినప్పుడు మానవత్వంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కుటుంబంలో అన్ని సంతోషాలే.

ఇలాంటి కోవలోనే తల్లిదండ్రుల మధ్య గొడవ పెరగడంతో.కన్న తండ్రినే గొడ్డలితో నరికి అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ కొడుకు.

ఈ విషాదకర ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం( Wajedu , Mulugu District ) పేరూరు గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Advertisement

వివరాల్లోకెళితే.పేరూర్ గ్రామానికి చెందిన బంధం రాములు( Bandham Ramulu ) (45) అనే వ్యక్తి మద్యం తాగి వచ్చి తరచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు.తాజాగా బుధవారం రాత్రి రాములు పీకలదాకా మద్యం సేవించి ఇంట్లో భార్యతో గొడవ పడ్డాడు.

భార్యాభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.రాములు కొడుకు నరేష్ వారిద్దరిని సముదాయించేందుకు ఎంత ప్రయత్నించినా తండ్రి వినకపోవడంతో క్షణిక ఆవేశంలో ఇంట్లో పక్కనే ఉన్న గొడ్డలి లో నరేష్ తన తండ్రి రాములు పై అత్యంత దారుణంగా దాడి చేశాడు.

అయితే బలంగా గాయాలు తగలడం, తీవ్ర రక్తస్రావం కావడం వల్ల రాముడు నేలపై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు.వీరి ఇంట్లో జరిగే గొడవ బయటకి వినిపించడంతో చుట్టుపక్కల ఉండేవారు అంత వచ్చేసరికి రాములు ప్రాణాలు విడిచాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
Advertisement