నేడే క్వాలిఫైయర్-2 పోరు.. ఫైనల్లో చెన్నై ను ఏ జట్టు ఢీ కొట్టనుందో..!

ఐపీఎల్ సీజన్-16( IPL season-16 ) తుదిదశకు చేరుకుంది.కేవలం ఒక క్వాలిఫైయర్ మ్యాచ్ మాత్రమే మిగిలింది.

నేడు అహ్మదాబాద్ వేదికగా 7:30 గంటలకు గుజరాత్- ముంబై( GT vs MI ) మధ్యన క్వాలిఫైయర్-2( Qualifier-2 ) మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో చెన్నై( CSK ) జట్టుతో టైటిల్ కోసం పోటీ పడనుంది.

ఈ విషయం అందరికీ తెలిసిందే.

ముందుగా ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.ఐపీఎల్ లో ముంబై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది.ఈ ఐపీఎల్ సీజన్ ను ముంబై పరాజయాలతో ఆరంభం చేసి, ఆ తరువాత ఫామ్ లోకి వచ్చి ప్లే ఆఫ్( Playoffs ) చేరింది.

Advertisement

ఇలా జరగడం ముంబై జట్టుకు కొత్తేమీ కాదు.ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇక ఈ సీజన్లో ముంబై జట్టు అద్భుత ఆటను ప్రదర్శించిన మ్యాచ్ ఏదంటే ఎలిమినేటర్ మ్యాచ్.

బ్యాటింగ్లో కాస్త ఇబ్బంది పడి బౌలింగ్లో దుమ్ములేపి 81 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఎన్నో ఆశలతో ప్లే ఆఫ్ కు చేరిన లక్నో జట్టును ముంబై ఇంటికి పంపించింది.

ఇక మొదటి నుండి మంచి ఫామ్ లో కొనసాగుతూ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గుజరాత్ జట్టు క్వాలిఫైయర్-1 మ్యాచ్లో చెన్నై చేతిలో ఓడింది.నేడు జరిగే క్వాలిఫైయర్-2 మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు రాణించలేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఒక్కమాటలో చెప్పాలంటే ముంబై బ్యాటర్లైన ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కామెరున్ గ్రీన్, సూర్య కుమార్ యాదవ్ లకు.గుజరాత్ బౌలర్లైన మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ అసలు సిసలైన పరీక్ష ఎదురుకానుంది.ఈ సీజన్ ఆరంభం నుంచి సాధారణ ఆటను ప్రదర్శించి, ఎలిమినేటర్ మ్యాచ్లో ఫీల్డింగ్ లో ముంబై జట్టు అదరగొట్టింది.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

దీంతో గుజరాత్ జట్టులో కాస్త టెన్షన్ మొదలైంది.అహ్మదాబాద్ వేదిక పై మొదట బ్యాటింగ్ చేసిన జట్లే అత్యధిక విజయాలు నమోదు చేశాయి.చేజింగ్ కు దిగిన జట్లు ఎక్కువగా ఓటమిని చవిచూశాయి.

Advertisement

కాబట్టి నేడు టాస్ గెలిచిన జట్టే ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.ఒక జట్టు బ్యాటింగ్లో పటిష్టంగా ఉంటే.

మరో జట్టు బౌలింగ్లో పటిష్టంగా ఉంది.ఏ జట్టు ఫైనల్ కు వెళ్తుందో చూద్దాం.

తాజా వార్తలు