అమెరికా: పాములతో భయపెట్టి గ్యాస్ స్టేషన్‌లో లూటీ... ఏం దొంగిలించారో తెలిస్తే?

అమెరికాలోని టెన్నెస్సీలో( Tennessee ) జరిగిన ఓ వింత దొంగతనం ఇప్పుడు వైరల్ అవుతోంది.

నమ్మశక్యం కాని రీతిలో, కొందరు దొంగలు గ్యాస్ స్టేషన్( Gas Station ) క్యాషియర్‌ను బెదరగొట్టి, వస్తువులు ఎత్తుకెళ్లడానికి ఏకంగా బతికున్న కొండచిలువలను( Pythons ) వాడారు.

మాడిసన్ కౌంటీలోని ఓ పెట్రోల్ బంక్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది.సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిన దాని ప్రకారం, ముందుగా ఓ మహిళతో పాటు మొత్తం నలుగురు వ్యక్తులు స్టోర్‌లోకి ఎంటరయ్యారు.

అందులోని మహిళ క్యాషియర్‌ను మాటల్లో పెట్టింది.ఆమె అలా మాట్లాడుతుండగానే, వారిలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఓ కొండచిలువను తెచ్చి టేబుల్ మీద పెట్టాడు.

అది బాల్ పైథాన్ జాతికి చెందిన పాము, సాధారణంగా ఇళ్లలో పెంచుకుంటారు.

Advertisement

ఈ పామును చూసి షాకైన క్యాషియర్, వెంటనే ఫోటో లేదా వీడియో తీయడానికి ఫోన్ తీయబోయాడు.కానీ, వెంటనే ఆ మహిళ అతని ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినట్లు కనిపించింది.ఇంతలోనే, మరో వ్యక్తి రెండో కొండచిలువను బయటకు తీసి, దానిని కూడా కౌంటర్ మీద వేలాడదీశాడు.

కాసేపటికే వీడియో ఆగిపోయింది.అయితే, ఈ పాముల గొడవంతా కేవలం క్యాషియర్‌ను బెదరగొట్టి, దొంగతనం చేయడంలో భాగమేనని అధికారులు భావిస్తున్నారు.ఇంతకీ అసలు ఏం ఎత్తుకెళ్లారు అనుకుంటున్నారా, దాదాపు 400 డాలర్ల (సుమారు రూ.33,000) విలువైన సీబీడీ ఆయిల్‌ను దొంగిలించినట్లు మాడిసన్ కౌంటీ షెరీఫ్ ఆఫీసు అధికారికంగా ప్రకటించింది.ఆ సమయంలో తన సోదరుడితో కలిసి డ్యూటీలో ఉన్న ఉద్యోగి, మయూర్ రావల్, ఆ పాములను చూసి తాను ఎంతగా భయపడిందీ చెప్పుకొచ్చాడు.

"వాళ్లు పాముల్ని చేతులతో పట్టుకుని అటూ ఇటూ ఊపుతూ కౌంటర్‌పై పెట్టారు," అని రావల్ మీడియాతో మాట్లాడుతూ ఆనాటి భయానక ఘటనను వివరించాడు.అందులో ఒకటి తెల్ల రంగులో ఉండగా, మరొకటి బ్రౌన్ లేదా మిక్స్డ్ కలర్‌లో ఉందని చెప్పాడు.అయితే, ఆ దొంగలు ఇంకా ఎక్కువే దోచుకోవాలని ప్లాన్ చేసి ఉండొచ్చని, కానీ ఆ సమయంలో స్టోర్‌లో జనం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ల ప్లాన్ మొత్తం వర్కౌట్ కాలేదని రావల్ అభిప్రాయపడ్డాడు.

"వాళ్లు కారును కూడా సరిగ్గా షాపు ముందు డోర్ దగ్గరికే తెచ్చి ఆపారు," అని రావల్ చెప్పాడు."అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని నేను అనుకుంటున్నాను.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఆ పాములే వాళ్లకు ఆయుధాల్లా ఉపయోగపడ్డాయి." అని అన్నాడు.

Advertisement

ప్రస్తుతం, ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.నిందితులు ఎవరు, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

అలాగే, దొంగతనానికి ఉపయోగించిన ఆ కొండచిలువలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు.

తాజా వార్తలు